ప్రజాశక్తి- కె.కోటపాడు
మండలంలోని చౌడువాడ శాఖా గ్రంథాలయానికి కొత్తగా వివిధ రకాల పుస్తకాలు వచ్చినట్లు గ్రంథాలయాధికారి ఎం.పద్మావతి తెలిపారు. గురువారం ఆమె స్థానిక విలేకరులతో మాట్లాడుతూ భగవద్గీత, రామాయణంతో పాటు వివిధ పోటీ పరీక్షలకు ఉపయోగపడే పుస్తకాలు, నవలలు, జాతీయ నాయకుల జీవిత చరిత్రలు మొదలైన 630 పుస్తకాలు వచ్చినట్లు చెప్పారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్ కొండా రమాదేవి, గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఆర్ వెంకట్రావు కృషితో నూతన పుస్తకాలు వచ్చినట్లు వెల్లడించారు. ఈ అవకాశాన్ని పరిసర గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
కశింకోట : కశింకోట శాఖ గ్రంథాలయానికి 771 కొత్త పుస్తకాలు వచ్చినట్లు గ్రంథాలయం అధికారి ఎస్.వరలక్ష్మి గురువారం తెలిపారు. జిల్లా గ్రంథాలయ సంస్థ నుండి వీటిని పంపించినట్లు వెల్లడించారు.
చీడికాడ : విశాఖ జిల్లా గ్రంధాలయ సంస్థ నుంచి స్థానిక శాఖా గ్రంధాలయమునకు తెలుగు, ఇంగ్లీష్, హిందీ 672 పుస్తకాలు సరఫరా చేసినట్లు గ్రంథాలయ అధికారిని ఎంఎస్‌ఎల్ జోగేశ్వరి అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, బాలసాహిత్యం, నవలలు, ఆధ్యాత్మిక, పర్సనాలిటీ డెవలప్ మెంట్ కు సంభందించిన పుస్తకములు అన్ని వర్గాల వారికి ఉపయోగ పడతాయని తెలిపారు. పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించారు.










