
ప్రజాశక్తి- లావేరు : స్థానిక శాఖా గ్రంధాలయాన్ని శుక్రవారం ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పరిషత్ సభ్యులు జీను మహేష్ బాబు, అడిషనల్ డైరెక్టర్ వి.రవికుమార్ ఆకస్మికంగా సందర్శించారు. గ్రంథాలయ వారోత్సవాలు ఎలా జరుగుతున్నాయి, రోజు విద్యార్థులు ఎంతమంది వస్తున్నారు, గ్రంథాలయంలో ఏ కార్యక్రమాలు చేస్తున్నారో విద్యార్థులతో ముఖాముఖి అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రంథాలయానికి సంబంధించిన పుస్తకాలు, వేసవి శిక్షణా శిబిరాలు, వారోత్సవాలు ఫోటోలు పరిశీలించారు. కార్యక్రమంలో గ్రంథాలయాధికారి మురపాక శ్రీనివాసరావు, విజయనగరం జిల్లా గ్రంధాలయ సంస్థ సీనియర్ అసిస్టెంట్ టిపికె ఆచార్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.
మెళియాపుట్టి : స్థానిక శాఖా గ్రంధాలయాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి బుర్రి కుమార్ రాజు శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గ్రంథాలయాలు, వాటి ఆవశ్యకతపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వ్యాసరచన పోటీలను పరిశీలించి మాట్లాడుతూ గ్రంథాలయాలు ప్రాధాన్యతను తెలియజేశారు. కార్యక్రమంలో గ్రంథాలయాధికారి ఆర్.అనురాధ, భాస్కరరావు, నీలిమ, చిరంజీవి పాల్గొన్నారు.
టెక్కలి: ప్రతి ఒక్కరు గ్రంథాలయాలను వినియోగించుకోవాలని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి బుర్రి కుమార్ రాజు ఆన్నారు. స్థానిక గ్రంథాలయంలో నిర్వహిస్తున్న వారోత్సవాలను ఆయన పర్యవేక్షించారు. కార్యక్రమంలో గ్రంథాలయాధికారిణి బి.రూపావతి, సహాయకులు ఎస్. అమ్మనమ్మ, విద్యార్దులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం అర్బన్: జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నిర్వహిస్తున్న 56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా విద్యార్థులకు దిశ చట్టం, మహిళా సాధికారత అనే అంశంపై వ్యాసరచన పోటీలను శుక్రవారం నిర్వహించారు. ఈ పోటీలను ఉపాద్యాయులు చాడా శ్రీనివాసరావు, చోడవరపు ఈశ్వరరావులు పర్యవేక్షించారు. కార్యక్రమంలో ఎన్‌టిఆర్ మున్సిపల్ హైస్కూల్, గవర్నమెంట్ జూనియర్ కాలేజీ విద్యార్థిని, విద్యార్థులు, పాల్గొన్నారు అనంతరం కవి సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి బుర్రి కుమార్‌రాజు, డిప్యూటీ లైబ్రేరియన్ వి.వి.జి.ఎస్. శంకరరావు, అసిస్టెంట్ లైబ్రేరియన్ ఎస్.వి.రమణమూర్తి, పి.రామ్మోహన్, టి.రాంబాబు, యు.కళ్యాణి, పి.వరలక్ష్మి, పి.భానుమతి, శివగణేష్ పాల్గొన్నారు.
ఎచ్చెర్ల: ధర్మవరం శాఖా గ్రంథాలయ ఆధ్వర్యంలో గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా పాఠశాలల విద్యార్థులకు ఆటల పోటీలు, పాటల పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పిడి శ్రీనివాసరావు, మిథిలా విద్యాలయం కరస్పాండెంట్ ఎం.జయరాం, హెచ్‌ఎం ఇందుమతి, గ్రంథాలయాధికారి చంద్రశేఖర్, సహాయకులు సూర్యనారాయణ, పాఠకులు ప్రకాష్, మహేష్, జగదీష్, సూరిబాబు, సురేష్, శంకర్, కిరణ్, విద్యార్థులు పాల్గొన్నారు.
ఇచ్ఛాపురం: గ్రంధాలయ వారోత్సవాల్లో భాగంగా గ్రంథాలయాధికారి పూర్ణచంద్ర బెహరా అధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు 50 మంది విద్యార్థులు హాజర్యారు. కార్యక్రమంలో స్వర్ణభారతి విద్యా సంస్థల ప్రిన్సిపాల్ గౌరి శంకర్ రెడ్డి, రవి శంకర్ మహా పాత్రో, నారాయణ ఉన్నారు.
కొత్తూరు: స్థానిక శాఖా గ్రంథాలయంలో వారోత్సవాల్లో భాగంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాల, విజ్ఞాన భారతి ప్రైవేటు ఉన్నత పాఠశాలలకు చెందిన 6, 7, 8 తరగతుల విద్యార్థులచే గ్రంథాలయ ఆవశ్యకతపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో గ్రంథాలయాధికారి ఇందిర, ప్రధానో పాధ్యాయులు ప్రసాదరావు, సిబ్బంది లక్మి పాల్గొన్నారు.