ప్రజాశక్తి-ఆలూరు
గ్రంథాలయాల ద్వారానే విద్యార్థులు, యువత విజ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్ తెలిపారు. ఆదివారం ఆలూరులోని స్వగృహంలో జాతీయ గ్రంథాలయ వారోత్సవాల గోడపత్రికను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎంతో మంది మేధావులు గ్రంథాలయాల్లో ఉన్న పుస్తకాలు చదివి ఉన్నత స్థాయికి ఎదిగారని తెలిపారు. విద్యార్థులు, యువత, ప్రజలు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వైసిపి ఇన్‌ఛార్జీ నారాయణస్వామి, జడ్‌పిటిసి ఏరూరు శేఖర్, దేవరగట్టు కమిటీ ఛైర్మన్ శ్రీనివాసులు, ఆలూరు, ఆస్పరి, చిప్పగిరి గ్రంథాలయ అధికారులు ఎన్.వెంకటేశ్వర్లు, విశ్వనాథ్ రెడ్డి, అబ్దుల్ రసూల్, విశ్రాంతి ప్రధానోపాధ్యాయులు వీరస్వామి, ఈరన్న పాల్గొన్నారు.