
గ్రంథాలయ సంస్థ చైర్మన్ తిప్పరమల్లి జమల పూర్ణమ్మ
ప్రజాశక్తి-కలక్టరేట్ (కృష్ణా) : జిల్లాలో పలు గ్రంధా లయ శాఖల భవనాల మరమ్మతులకు, ఇతర అభివద్ధి పనులకు నిధులు మంజూరు కోరుతూ పరిపాలన ఆమో దం కోసం ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపుటకు జిల్లా గ్రంధాలయ సంస్థ సర్వసభ్య సమావేశం తీర్మానించింది. శుక్రవారం జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ తిప్పరమల్లి జమల పూర్ణమ్మ అధ్యక్షతన నగరంలోని వారి చాంబర్లో సంస్థ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉమ్మడి కష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలోని విజయవాడ ఠాగూర్ స్మారక గ్రంథాలయ భవన మరమ్మతుల కోసం 31 లక్ష రూపాయలను మంజూరు కోరుతూ పరిపాలన ఆమోదం కోసం పౌర గ్రంథాలయ శాఖ సంచాలకుల వారికి ప్రతిపాదనలు పంపుటకు సమావేశం తీర్మానించింది. అలాగే గుడివాడ ప్రథమ శ్రేణి శాఖ గ్రంధాలయ పాత భవనమును కూల్చి నూతన భవన నిర్మాణానికి 1.85 లక్షల రూపాయలను పరిపాలన ఆమోదం కోసం ప్రతిపాదనలను పంపుటకు సమావేశం తీర్మానించినట్లు చైర్మన్ జమల పూర్ణమ్మ తెలిపారు. ఈ సమావేశంలో వయోజన విద్య ఉప సంచాలకులు హాజీబేగ్, ఉప విద్యాధికారి యు వి. సుబ్బా రావు, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి యమ్.వెంకటేశ్వర ప్రసాద్, డిపిఓ ఏవో పి. రవికుమార్, గ్రంథాలయ సంస్థ కార్యదర్శి రవికుమార్ పాల్గొన్నారు.