
గ్రంథాలయ వారోత్సవాలు
ప్రజాశక్తి-అనంతసాగరం : 56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా 6వ రోజు ఆదివారం మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మేరకు మాజీ ప్రధాని ఇందిరా గాంధీ, ఝాన్సీలక్ష్మీబాయిల చిత్రపటాలకు శాంతినికేతన్ స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు భువనేశ్వరీ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇందిరాగాంధీ నాలుగుసార్లు ప్రధానమంత్రిగా పేదబడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా 20సూత్రాల పథకాలను ప్రవేశపెట్టి దేశప్రజల సంక్షేమానికి కృషి చేశారన్నారు. దేశ స్వాతంత్య్రం కోసం బ్రిటీష్ సైన్యంతో వీరోచిత పోరాటం చేసిన ఝాన్సీలక్ష్మీబాయి మహిళా లోకానికి ఆదర్శమన్నారు. అనంతరం విద్యార్థులకు మిఠాయిలు పంచిపెట్టారు. కార్యక్రమంలో గ్రంథాలయ భాండాగారి నారాయణరావు, ఉపాధ్యాయులు హజరత్తయ్య, హరిబాబు, విద్యార్థులు పాల్గొన్నారు.