Nov 11,2022 00:00

పెందుర్తి శాఖా గ్రంథాలయంలో పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న సూర్యకళ తదితరులు

ప్రజాశక్తి-పెందుర్తి, గాజువాక : గ్రంథాలయ వారోత్సవాలకు సంబంధించిన పోస్టర్‌ను గురువారం పెందుర్తి శాఖా గ్రంథాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గ్రంథాలయాధికారి బి.సూర్యకళ మాట్లాడుతూ, ఈ నెల 14వ తేదీ నుంచి వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. అందరూ హాజరై వారోత్సవాలను విజయవంతం చెయ్యాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆడారి రామకృష్ణ, గ్రంథాలయ అభివృద్ధి కమిటీ సెక్రటరీ దాసరి సత్యం, డి.దేవుడు, ఎస్‌బిఐ లైఫ్‌ ఇన్స్యూరెన్స్‌ సీనియర్‌ ఏజెన్సీ మేనేజర్‌ పి జగన్నాధరావు, విద్యార్థులు, పాఠకులు పాల్గొన్నారు.
గ్రంథాలయ వారోత్సవాల పోస్టర్‌ ఆవిష్కరణ
-గాజువాక : గాజువాక గ్రంథాలయ వారోత్సవాల పోస్టర్‌ను గ్రంథాలయాధికారి బి.చంద్రకళ గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలు చేయనున్నట్లు తెలిపారు.