
నివాళులర్పిస్తున్న దృశ్యం
గ్రంథాలయ ఉద్యమ
పితామహులకు నివాళులు
ప్రజాశక్తి-మర్రిపాడు:6వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా రెండో రోజు గ్రంథాలయ ఉద్యమంలో కషి చేసిన అయ్యర్, ఎస్‌ఆర్ రంగనాధ్ చిత్రపటాలకు వైసీపీ మండల మాజీ కన్వీనర్ శ్రీనివాసులు నాయుడు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహనీయుల కషి ఫలితమే నేడుగ్రంథాలయాలు వెలసి ప్రజలకు అందుబాటులో ఉన్నాయన్నారు.విద్యార్థులు గ్రంథాలయ పుస్తకాలపై మక్కువ పెంచుకొని విజ్ఞానం పొంది అభివద్ధి చెందాలన్నారు.గ్రంధబాండాగారి నారాయణరావు మాట్లాడుతూ ఉద్యమంలో విశేష కషి చేసి ఆయుర్వేదం,ప్రకతి వైద్య సిద్ధ హస్తునిగా, పత్రికా సంపాదకునిగా,పేరుగాంచి, గ్రంథాలయ పితామహా,విశారద వంటి బిరుదులు పొందిన అయ్యర్ వెంకటరమణయ్య, గ్రంథాలయ శాస్త్రానికి 5సూత్రాలు వివరించిన ఎస్‌ఆర్ రంగనాధ్ లు చిరస్మర నీయులని కొనియాడారు.విద్యార్థులకు పలు రకాల పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో మహిళా ఉపాధ్యాయులు భాగ్యలక్ష్మి, కష్ణవేణి, కళ్యాణి, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.