
ప్రజాశక్తి- నక్కపల్లి:మండలంలోని చినదొడ్డిగల్లు శాఖ గ్రంధాలయంలో సోమవారం గ్రంథాలయ అధికారి జనార్దన్ ఆధ్వర్యంలో గ్రంథాలయ పితామహుడు అయ్యంకి వెంకట రమణ 133వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ముందుగా అయ్యంకి వెంకట రమణ చిత్ర పటానికి పూల మాల వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు.ఈ సంధర్భంగా గ్రంధాలయ అధికారి జనార్దన్ మాట్లాడుతూ, గ్రంథాలయాల అభివృద్ధికి అయ్యంకి ఎనలేని కృషి చేశారన్నారు.1934 నుండి 1948 సంవత్సర మధ్యకాలంలో కోస్తాంధ్రలో అనేక గ్రంథాలయాలను ఆయన స్థాపించారని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ అప్పలరాజు, సిబ్బంది రమణమ్మ, పాఠకులు పాల్గున్నారు.
గొలుగొండ:స్థానిక గ్రంథాలయంలో ఆ శాఖాధికారి రాజుబాబు ఆధ్వర్యంలో అయ్యంకి వెంకట రమణయ్య జయంతి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన సీఆర్పీ రామకృష్ణ, కేజీబీవీ పాఠశాల ఒకేషనల్ ఉపాధ్యాయురాలు రవణమ్మలు మాట్లాడుతూ, ఇటువంటి ఉద్యమ నాయకులను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కేజీబీవీ పాఠశాల నుండి 11 మంది పాల్గొన్నారు.