Nov 12,2022 21:55

ప్రజాశక్తి - భీమడోలు
              భీమడోలు శాఖా గ్రంథాలయం అభివృద్ధికి భీమడోలు విశాల సహకార పరపతి సంఘం సాయం అందించేందుకు ముందుకు రావడం అభినందనీయమని వైసిపి ఉంగుటూరు నియోజకవర్గ నేత, ఎంఎల్‌ఎ సోదరులు పుప్పాల కార్తిక్‌ తెలిపారు. స్థానిక శాఖా గ్రంథాలయంలో వివిధ కార్యక్రమాలను నిర్వహించుకునేందుకు భీమడోలు సొసైటీ సహకార సంఘం రూ.7500 విలువైన మైక్‌సెట్‌ను బహూకరించారు. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పుప్పాల కార్తిక్‌ హాజరయ్యారు. ఈ నేపథ్యంలో సొసైటీ తరపున పాలక మండలి చైర్‌పర్సన్‌ ఆర్‌.సత్యశ్రీనివాస్‌, పర్సన్లు సవలం నాని, కె.భాస్కరరావు, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఆర్‌.రాంబాబు మైక్‌సెట్‌ను శాఖ గ్రంథాలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు టివి.ఉమామహేశ్వరరావు, గౌరవాధ్యక్షులు రామకుర్తి నాగేశ్వరరావు, గ్రంథ పాలకులు కె.శ్రీనివాసరావులకు అందించారు.