ప్రజాశక్తి-యంత్రాంగం
పాడేరు:గిరిజనుల నిరసన ధ్వనులతో పాడేరు హౌరెత్తింది. ప్రభుత్వం చేసిన తీర్మానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని గిరిజనలు పెద్ద పెట్టున నినదించారు. పాడేరు పట్టణంలో సాయంత్రం వరకు నిరసన ర్యాలీలు కొనసాగించారు. రోడ్డుపై బైఠాయింపులు, వంటావార్పుతో ఆదివాసీలు నిరసన చేపట్టారు. సీఎం డౌన్‌డౌన్ అంటూ ఆదివాసీలు తమ నిరసనలు వ్యక్తం చేశారు.స్థానిక ఎమ్మెల్యే ఎంపీలు తమ వైఖరి స్పష్టం చేయాలని ఆదివాసీలు డిమాండ్ చేశారు.ఏపీ -గిరిజన సంఘం-ఆదివాసి-జేఏసీ వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ, సచివాలయం సంఘాల ఆధ్వర్యంలో మన్యంలో చేపట్టిన బంద్ విజయవంతగా నిర్వహించారు.
పాడేరు టౌన్:హుకుంపేట మండలం గూడ గ్రామంలో గిరిజనులు మోకాళ్లపై అర్థనగ ప్రదర్శన చేపట్టి తమ నిరసనను తెలిపారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం నేత పి.అప్పలనర్స మాట్లాడుతూ, రాజ్యాంగం తమకిచ్చిన హక్కులు, చట్టాలను కాలరాయొద్దని, ఇతర కులాలను ఎస్‌టి జాబితాలో చేర్చాలంటూ అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇతర కులాలను షెడ్యూల్డ్ ట్రైబ్ (ఎస్ టి) జాబితాలో చేర్చేముందు గిరిజన సలహా మండలి (టిఎసి)లో చర్చించకుండా ముఖ్యమంత్రి జగన్ ఏకపక్షంగా ఎలా తీర్మానం చేశారని ప్రశ్నించారు. అసెంబ్లీలో సిఎం జగన్ తీర్మానం ప్రవేశపెట్టి ప్రసంగిస్తున్న సమయంలో గిరిజన ఎమ్మెల్యేలు ఒక్క మాట మాట్లాడకుండా ఉండడానికి తీవ్రంగా ఖండించారు. ఇతర కులాలను ఎస్‌టిల్లో చేర్చాలని నివేదిక ఇచ్చిన ఎస్‌టి కమిషన్ చైర్మన్ కుంభా రవిబాబు ఏజెన్సీ మైనింగ్ ఏజెంట్ అని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, రిటైర్డ్ ఐఎఎస్ అధికారి బాబురావు నాయుడు, టిడిపి సీనియర్ నేతలు బొర్రా నాగరాజు, పాండు, జనసేన నేత వి.గంగులయ్య, బిజెపి నేతలు ఉమామహేశ్వరరావు, కూడా కృష్ణారావు, గిరిజన ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు ముఖి శేషాద్రి, పలాసి క్రిష్ణరావు, సింహాచలం, కుర్తాడి రామారావు, తదితరులు బంద్ లో పాల్గొని మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు పాలికి లక్కు, సుందరరావు, జెఎసి నాయకులు గంగరాజు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
ఐటీడీఏ పీవో వాహనం అడ్డగింత..
రాష్ట్రవ్యాప్త మన్యం బంద్ సందర్భంగా ఐటిడిఎ పిఒ రోణంకి గోపాలక్రిష్ణ వాహనాన్ని సినిమా హాల్ సెంటర్ వద్ద శుక్రవారం గిరిజన నాయకులు అడ్డుకున్నారు. రిటైర్డ్ ఐఎఎస్ అధికారి బాబురావు నాయుడు, గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు పి.అప్పలనర్స, జిల్లా నేత పాలికి లక్కు, జెఎసి నేత రామారావు దొర, టిడిపి నేత బొర్రా నాగరాజు, జనసేన నేత గంగులయ్య తదితరులు పిఒ వాహనం ఎదురుగా రోడ్డుపై పడుకుని అడ్డగించారు. దీంతో పిఒ వాహనం దిగి సుమారు అర కిలోమీటరు దూరం కాలినడకనే ఐటిడిఎ కార్యాలయానికి చేరుకున్నారు. టిడబ్ల్యూ డిడి ఐ.కొండలరావుతో పాటు ఇతర అధికారులు కాలినడకన ఐటిడిఎ కార్యాలయానికి చేరుకుని విధులకు హాజరయ్యారు.
పెడబయలు:మండల కేంద్రంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కార్యాలయాలు మూతపడ్డాయి. సీపీఎం జిల్లా.కమిటీ నాయకుడు బి.సన్నిబాబు, గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పృధిరాజ్ మాట్లాడుతూ సీఎం జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని తీసుకోవాలన్నారు. వైసిపి నాయకుడు గపారాయి సూరయ్య మాట్లాడుతూ, తీర్మానం రద్దు చేసేవరకు ఉద్యమం ఆగదన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం సీనియర్ నాయకుడు, మాజి ఎంపిపి, వి , కొండయ్య, జెడ్పీటీసీ కె,బొంజుబాబు, సీఐటీయూ కార్యదర్శి కె.శరబన్న, వైస్ ప్రెసిడెంట్ గంగాదరం, మాజి సర్పంచుల పోరం అద్యక్షుడు సింహాచలం, ఉద్యోగ సంఘాల మాజీ నాయకులు అప్పారావు, జె ఏ సీ నాయకుడు పోతురాజు, వర్తక సంఘం అధ్యక్షుడు భాస్కర్‌రావు పాల్గొన్నారు.
వైసిపి ఎంపీ, ఎమ్మెల్యేలు వైఖరి తెలపాలి
గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి కిల్లో సురేంద్ర.
అరకులోయ రూరల్:మండల కేంద్రంలో సీఐటీయూ, ఎస్‌ఎఫ్‌ఐ, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు బంద్‌లో పాల్గొని మద్దతు తెలిపారు. గిరిజన మ్యూజియం, పద్మావతి గార్డెన్, కాపీ మ్యూజియం మూతపడ్డాయి. ఈ సందర్భంగా గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి కిల్లో సురేంద్ర మాట్లాడుతూ, సిఎం జగన్మోహన్‌రెడ్డి రాజకీయ లబ్ధి కోసమే అసెంబ్లీలో తీర్మానం చేశారని మండిపడ్డారు. రాయలసీమ ప్రాంతంలో నివసిస్తున్న బీసీ ఏకు బోయ వాల్మీకిలను ఎస్టీ జాబితాలో ఎలా చేర్చుతారని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు, ఎంపీ, జిల్లా చైర్పర్సన్ వైఖరి తెలపాలని మండి పడ్డారు.
ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు పొద్దు బాలదేవ్, పెదలబుడు సర్పంచ్ దాసు బాబు, సుంకరమెట్ట సర్పంచ్ చిన్న బాబు, గిరిజన సంఘం మండల కార్యదర్శి పాంగి రామన్న, సిఐటియు జిల్లా కార్యదర్శి వి.ఉమామహేశ్వరరావు, సర్పంచ్‌ల పోరం అధ్యక్షుడు పాడి రమేష్, చినలబుడు సర్పంచ్ ఉపేంద్ర, వైసిపి నాయకులు బాలరాజు, గిరిజన సంఘం మండల నాయకులు కె.రామారావు, టీడిపి నాయకులు సివేరి సురేష్ కుమార్, గిరిజన సంఘం నాయకులు జగన్నాదం, మగ్గన్న, బుజ్జి బాబు పాల్గొన్నారు.
డుంబ్రిగూడ:మండల కేంద్రంలోని మూడు రోడ్ల జంక్షన్ వద్ద గిరిజన సంఘం ఆధ్వర్యంలో రోడ్డుపై జెండాలను ఏర్పాటు చేశారు. స్వచ్ఛందంగా కిరాణా దుకాణాలు, ప్రైవేట్ వాహనాలు,పెట్రోల్ బంక్, యూనియన్ బ్యాంక్ తో పాటు ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. చాపరాయి జలపాతం బోసిపోయింది. కించుమండలో గ్రామస్తులు స్వచ్ఛందంగా బంధ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు టి సూర్యనారాయణ, సిపిఎం మండల కార్యదర్శి ఎస్ బి పోతురాజు, టిడిపి మండల అధ్యక్షుడు టి.సుబ్బారావు, టిడిపి అరకు పార్లమెంట్ కార్యదర్శి కే.సుబ్బారావు టిఎన్టియుసి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి ఎం.స్వామి, వైసీపీ మండల అధ్యక్షుడు ఎస్.గోపాల్, సీనియర్ నాయకుడు ఎం.శ్రీరాములు బి.సింహాచలం, సిపిఐ మండల కార్యదర్శి కే.సింహాచలం, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జి దయానిది, సులోచన ,సర్పంచ్ కోములు,యుటిఎఫ్ మండల అధ్యక్షుడు ఎస్ బాలకృష్ణ, ఎం చందర్రావు,పిఆర్‌టియు జిల్లా అధ్యక్షుడు ఎస్ అప్పలరాజు, అల్లూరి యూత్ మండల అధ్యక్ష కార్యదర్శులు కే సూర్య ప్రకాష్, నవసూర్య,గిరిజన సంఘం మండల నాయకుడు పి.సురేష్ కుమార్, పి సత్యనారాయణ పాల్గొన్నారు.
హుకుంపేట: బంద్ కారణంగా సర్వసభ్య సమావేశం రద్దు అయ్యింది. ప్రజా సంఘాల నేతలు స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుంచి ర్యాలీ చేశారు. బరోడా బ్యాంక్, పెట్రోల్ బ్యాంకు, మూత బడాయి. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం రాష్ట్ర చిన్నంనాయుడు, గిరిజన సంఘం నేతలు టి.కృష్ణారావు, లక్ష్మణ్‌రావు, వైస్ ఎంపీపీ సుడిపల్లి కోండలరావు, సీఐటీయూ నాయకురాలు ఈVౖామావతి, టీడీపీ నేతలు కె.సంతోష్ కూమర్,శ్యామ్ పాల్గొన్నారు.
అనంతగిరి:మండల కేంద్రంతో పాటు చిల్లలగెడ్డ పంచాయతీ పరిధి వంకాయపాలేం గ్రామం ప్రధాన రహదారిపై ఆందోళన చేపట్టారు. సాయంత్రం వరకు వాహనాలు నిలిచి పోయాయి. బొర్రా గుహలు మూసివేశారు. జెడ్పిటిసి సభ్యుడు డి.గంగరాజు మాట్లాడుతూ, గిరిజన ఎమ్మెల్యేలు, ఎస్టీ కమిషన్ చైర్మన్ కుంభ రవిబాబులు ప్రజల పక్షాన ఉంటారా గిరిజన ద్రోహులుగా మిగులుతారా తేల్చు కోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్, సిపిఎం సర్పంచ్ కె.మొస్య. ఎస్.రూతు, టిడిపి సర్పంచ్ జె.అప్పారావు. సిపిఎం మండల కార్యదర్శి ఎస్.నాగులు, గిరిజన సంఘ మండల కార్యదర్శి జె.సుబ్బారావు ఆదివాసి జేఏసీ ఉద్యమకారులు గురుదొర, సన్యాసిరావు, యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు పి.దేవుడు సింహాచలం, కొండబాబు టిడిపి నాయకులు ఆనందు. బుజ్జిబాబు పాల్గొన్నారు
ముంచింగిపుట్టు:మండల కేంద్రంలో నాలుగు రోడ్ల కుడలిలో జేఏసీ ఆధ్వర్యంలో మన్యం బంద్ విజయవంతంగా కొనసాగింది. భారీ ర్యాలీ, మానవహారం ఏర్పాటు చేశారు.
పాడేరు: చింతపల్లి మండల కేంద్రంలో గిరిజన సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బోనంగి చిన్నయ్య పడాల్, నాయకులు పాంగి ధనుంజరు, జీవన్ కష్ణ శ్రీను, నాయుడు, చిరంజీవి, సింహాచలం, రామకష్ణ కార్తీక్ తదితరులు బంద్ నిర్వహణలో పాల్గొన్నారు మండల కేంద్రంలోని మెయిన్ రోడ్డు పై బైఠాయించారు.దింసా నృత్యాలతో ఆదివాసీలు తమ వ్యతిరేకతను వెలిబుచ్చారు.
జి.మాడుగుల:మండల కేంద్రంలో పలు పార్టీల నాయకులు భారీ నిరసన చేపట్టారు. వ్యాపారస్తులు స్వచ్ఛందంగా షాపులను మూసేశారు. ఈ కార్యక్రమం లో అఖిలపక్ష నాయకులు., గిరిజన సంఘం నాయకులు పాల్గొన్నారు.










