
బ్రోచర్‌ను విడుదల చేస్తున్న స్టీల్ సిఎమ్‌డి అతుల్‌భట్ తదితరులు
ప్రజాశక్తి -గాజువాక : కెనడా సౌజన్యంతో వైజాగ్ ప్రొఫైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ గ్రీన్ సిటీలో ఏర్పాటుచేసిన ఇంటర్నేషనల్ బిజినెస్ డివిజనల్ కార్యాలయాన్ని స్టీల్‌ప్లాంట్ సిఎమ్‌డి అతుల్‌భట్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అతుల్ భట్ మాట్లాడుతూ, ప్రపంచంలో వైజాగ్ స్టీల్‌కు ప్రత్యేక గుర్తింపు వచ్చిందన్నారు. ఈ మేరకు వైజాగ్ ప్రొఫైల్స్ ఎమ్డీ బండి సురేష్‌కుమార్, డైరెక్టర్ వివి.కృష్ణారావును అభినందించారు. సుమారుగా రూ.10 వేల కోట్లు ఎగుమతులు చేస్తున్న వైజాగ్ ప్రొఫైల్స్ ఆలోచనలు గొప్పవన్నారు. అనంతరం బ్రోచర్‌ను విడుదలచేశారు. ఈ కార్యక్రమంలో రమేష్, చిన్న సురేష్, సృజన్, హర్ష, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.