Oct 16,2023 22:01

నిరసన తెలుపుతున్న గ్రీన్‌ అంబాసిడర్లు

ప్రజాశక్తి-పార్వతీపురం : గ్రీన్‌ అంబాసిడర్లకు 12 నెలల బకాయిలు వేతనాలు చెల్లించాలని సోమవారం సిఐటియు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అనంతరం కలెక్టర్‌ కార్యాలయంలో గ్రీవెన్స్‌లో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకులు గొర్లి వెంకటరమణ మాట్లాడుతూ గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుతూ ప్రజారోగ్యాన్ని పరిరక్షిస్తున్న గ్రీన్‌అంబాసిడర్లకు ఏడాదిపాటు జీతాలు చెల్లించకపోతే వారు ఎలా కుటుంబాలను పోషించుకోగలరని ప్రశ్నించారు. గతంలో స్వచ్ఛభారత్‌ మిషన్‌ ద్వారా వీరి వేతనాలు చెల్లించేవారని గుర్తుచేశారు. తర్వాత కాలంలో పంచాయతీలకు అప్పగించిన తర్వాత వీరి బాధలు దారుణంగా ఉన్నాయన్నారు. తక్షణమే గ్రీన్‌అంబాసిడర్లకు వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు గవర వెంకటరమణ, గ్రీన్‌ అంబాసిడర్ల నాయకులు జలుమూరు గౌరీ, కందుకూరి రాము, తోట ఆనంద్‌ తదితరులు పాల్గొన్నారు.