ప్రజాశక్తి - కాకినాడ కార్పొరేషన్ పోలీసుల నియంత్రిత గ్రీన్ ఛానల్ మార్గం ద్వారా మానవ మూత్రపిండాలను కాకినాడ నుంచి విశాఖపట్నంకు సకాలంలో చేరేలా సమన్వయం చేసిన ఎస్‌పి ఎస్.సతీష్ కుమార్‌కు కాకినాడ అపోలో యాజమాన్యం అభినందనలు తెలిపింది. కాకినాడ అపోలో ఆస్పత్రిలో బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుంచి ఉదయం 11.45 గంటలకు కాకినాడ నుంచి మానవ మూత్రపిండాలను అవయవ మార్పిడి నిమిత్తం తీసుకుని బయలుదేరిన అంబులేన్స్ విశాఖపట్నంకు కేవలం 2 గంటల వ్యవధిలోనే చేరుకునేలా ఎస్‌పి ట్రాఫిక్ మరియు శాంతి భద్రతల విభాగ పోలీసు అధికారులను సమన్వయం చేశరు. ఏర్పాటు చేసిన గ్రీన్ ఛానల్ ద్వారా మధ్యాహ్నం 1.45 గంటలకు సకాలంలో చేరి 2 గంటలకు ఆపరేషన్ నియమిత సమయంలో జరిగేలా సహకరించారు. రెండు జీవితాలను కాపాడడంతో సాయపడ్డారు. గ్రీన్ ఛానల్‌లో విధులు నిర్వహించిన పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్‌పి ప్రత్యేకంగా అభినందించారు.










