రాస్తారోకో చేస్తున్న గ్రీన్ అంబాసిడర్లు
ప్రజాశక్తి-సీతానగరం : వేతన బకాయిలను వెంటనే చెల్లించి గ్రీన్ అంబాసిడర్లను ఆదుకోవాలని సిపిఎం మండల కార్యదర్శి రెడ్డి ఈశ్వరరావు డిమాండ్ చేశారు. శనివారం హనుమాన్ జంక్షన్‌లో గ్రీన్‌అంబాసిడర్లు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 14 నెలలుగా వేతనాలు లేక గ్రీన్‌అంబాసిడర్లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రామభద్రపురం మండలం ఆరికతోట గ్రామానికి చెందిన మావిడి త్రినాథరావు జీతాలు అందక ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని చెప్పారు. మెరుగైన వైద్యం అందించి, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో గౌరీ, అప్పలనాయుడు, సూరి, సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.










