గ్రీన్ అంబాసిడర్ల జీతాలు చెల్లించండి
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: దీపావళి పండుగ లోపు జీతాలు వేయకపోతే నవంబర్ 21, 22 తేదీల్లో డిపిఓ కార్యాలయం దగ్గర 36గంటలు నిరసన దీక్షలకు పూనుకుంటామని ఏఐటీయూసీ జిల్లా ప్రధానకార్యదర్శి టి.కోదండయ్య, జిల్లా గౌరవ అధ్యక్షులు ఎస్.నాగరాజు హెచ్చరించారు. జిల్లాలో పనిచేస్తున్న గ్రీన్ అంబాసిడర్లకు సుమారు 25 నెలల నుంచి 30 నెలలు జీతాలు పెండింగ్లో ఉన్నాయన్నారు. జీతాలు చెల్లించాలని కొంత కాలంగా కార్మికవర్గం పోరాటం చేస్తున్నప్పటికీ జిల్లా అధికారులు, ఎంపీడీవోల దష్టికి తీసుకువచ్చిన జీతాలు మాత్రం ఇంతవరకు వేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 15 ఫైనాన్సులో కమిషనర్ లెటర్ ఇచ్చినప్పటికీ జిల్లా మండలసాయ అధికారులకు సర్క్యులర్ పంపించిన జీతాలు చెల్లించడానికి ఈ అధికారులకు మనసు రావడం లేదని ఆరోపించారు. స్పందన, జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో వినతిపత్రాలు ఇచ్చినప్పటికీ కనీసం ఆ సమస్య పైన అధికారులు స్పందించలేదని అన్నారు. జీతాలు చెల్లించకుంటే ఈనెల 21, 22 రెండు రోజులపాటు 36 గంటలు డిపిఓ కార్యాలయం దగ్గర నిరసన దీక్ష చేపడుతామని హెచ్చరించారు. అనంతరం డిపిఒ ఆఫీసులో సీనియర్ అసిస్టెంట్ మురళికి వినతి పత్రం అందించారు. గ్రీన్ అంబాసిడర్ వర్కర్ సినీ జిల్లా ప్రధానకార్యదర్శి ఎస్.గోవిందస్వామి, జిల్లా అధ్యక్షులు విజయ కుమార్ కార్మికులు పాల్గొన్నారు.










