
ప్రజాశక్తి - భట్టిప్రోలు
మండలంలోని పల్లెకోనకు చెందిన గ్రేస్ ఫౌండేషన్ రెండు తెలుగు రాష్ట్రాల్లో చేస్తున్న సేవలకు గుర్తింపుగా పల్నాడు జిల్లా వినుకొండలో బంగారు నంది అవార్డును సోమవారం అందజేశారు. ఫౌండేషన్ అధినేత కైతేపల్లి సాలెంరాజ్, ఏపీ ఇంచార్జ్ అన్నం సురేష్‌లకు ఈ వార్డులు అందుకున్నారు. బెజవాడ చారిటబుల్ ట్రస్ట్, లిటిల్ చాంప్స్ అకాడమీ ఆఫ్ ఇండియా సంయుక్తంగా రాష్ట్రస్థాయి భరతనాట్యం సమ్మేళనం, సమాజ సేవకులకు ఎక్స్‌లెంట్ అవార్డు 2023లో భాగంగా సోమవారం 72మందికి ఈ అవార్డులను ప్రధానం చేశారు. సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా అవార్డు అందజేసినట్లు లిటిల్ చాంప్స్ అకాడమీ చైర్మన్ బుచ్చేశ్వరరావు తెలిపారు. కార్యక్రమంలో వినుకొండ మున్సిపల్ చైర్మన్ దస్తగిరి షకీలా, మున్సిపల్ కమిషనర్ డి వెంకటేశ్వరరావు, ఎఎంసి చైర్మన్ బొత్తుల వెంకటేశ్వర్లు, సిఐఎస్ సాంబశివరావు, ఎఎంసి మాజీ చైర్మన్ గంధం బాల్రెడ్డి, రోటరీ అధ్యక్షులు సిహెచ్ కోటేశ్వరరావు పాల్గొన్నారు.