Nov 21,2023 21:59

గర్భిణులు తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్‌ను ఉపయోగించుకోవాలి
డిఎం అండ్‌ హెచ్‌ఒ ప్రభావతిదేవి
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌

గర్భిణులు తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్‌, 104 కాల్‌ సెంటర్‌ను ఉపయోగించుకొని హైరిస్క్‌ గర్భవతులు, సివియర్‌ అనీమియాతో ఉన్న గర్భిణీ స్త్రీలు, ఐరన్‌ సుక్రోస్‌ కోసం ఇంటి నుండి మీరు 104 కాల్‌ సెంటర్‌కు కాల్‌ చేసి 4 నంబరును ఎంచుకొని గర్భిణి జాబితాను చెప్పి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి ప్రభావతిదేవి అన్నారు. మంగళవారం స్థానిక డిఎం అండ హెచ్‌ఒ కార్యాలయంలో నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో డిఎం అండ్‌హెచ్‌ఒ మాట్లాడుతూ అభ్యర్థనను చేసిన తర్వాత హైరిస్క్‌ గర్భిణి కోసం 48 గంటలలోపు సివియర్‌ అనీమియా గర్భిణీ స్త్రీలు, ఐరన్‌ సుక్రోస్‌ కోసం 24 గంటలలోపు రవాణా ఏర్పాటు చేయబడుతుందని అన్నారు. హైరిస్‌ గర్భిణీని ఇంటివద్ద నుండి హాస్పిటల్‌కి మాత్రమే రవాణా చేయబడుతుందని, సివియర్‌ అనీమియా గర్భిణీ స్త్రీలను, ఐరన్‌ సుక్రోస్‌ కేసెస్‌ని ఇంటివద్ద నుండి హాస్పిటల్‌కి, హాస్పిటల్‌ నుండి ఇంటి వద్దకు చేరవేయబడునని తెలిపారు. వైద్య అధికారులు తప్పనిసరిగా హైరిస్క్‌ గర్భిణీ స్త్రీని అధిక ప్రమాదంగా ధవీకరించాలని, మాతా శిశు సంరక్షణ కార్డ్‌లో వివరాలను నమోదు చేయాలన్నారు. అలాగే సివియర్‌ అనీమియా గర్భిణీ కోసం తప్పనిసరిగా అనుసరించాలన్నారు. హైరిస్క్‌ గర్భిణీ స్త్రీలను, సివియర్‌ అనీమియా గర్భవతులను రవాణా చేయడానికి తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ సేవలను వినియోగించుకోవాలని సూచించారు.