Sep 21,2023 21:00

ప్రజాశక్తి - పెనుమంట్ర
పౌష్టికాహారం తీసుకోవడం వల్ల గర్భిణులు, బాలింతలకు అనారోగ్య సమస్యలు ఉండవని ఐసిడిఎస్‌ సిడిపిఒ ఎ.కృష్ణకుమారి తెలిపారు. గురువారం పెనుమంట్ర పెద్ద చెరువు గట్టు వద్ద గ్రామస్థాయి పోషికాహార మాసోత్సవ కార్యక్రమం సర్పంచి తాడిపర్తి ప్రియాంక అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కృష్ణకుమారి మాట్లాడుతూ ముఖ్యంగా బాలామృతం, రాగి పిండితో చేసిన ఆహారం తీసుకోవడం వల్ల పుట్టబోయే బిడ్డ మరింత ఆరోగ్యంగా ఉంటుందన్నారు. అనంతరం లబ్ధిదారులకు పౌష్టికాహారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సూపర్‌వైజర్‌ ఎ.వెంకటలక్ష్మి, అంగన్‌వాడీ కార్యకర్తలు నేలపాటి అరుణకుమారి, గొట్టుముక్కల శాంతి, జి.వెంకటలక్ష్మి, వివిఎస్‌ సుబ్బలక్ష్మి పాల్గొన్నారు.
ఉండి : రాష్ట్ర ప్రభుత్వం అందించే పోషకాహారాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఐసిడిఎస్‌ సిడిపిఒ వాణి విజయరత్నం, కెవికె ప్రోగ్రాం కోఆర్డినేటర్‌ ఎన్‌.మల్లికార్జునరావు అన్నారు. గురువారం కృషి విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన మండల స్థాయి పోషణ మహా కార్యక్రమంలో పాల్గొన్న వారు మాట్లాడారు. పోషకాహారం తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య నివారించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో కెవికె శాస్త్రవేత్త డిబోరా మిస్సియానా, అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు రత్నకుమారి, మేరీ, నాగలక్ష్మి, నిర్మల పాల్గొన్నారు.