Aug 03,2023 21:22

ప్రజాశక్తి - వీరవాసరం
వ్యవస్థలోని ప్రతి వ్యక్తి బాధ్యతా తనదేనన్నట్టు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సంక్షేమ పథకాలకు రూపకల్పన చేశారని సర్పంచి చికిలే మంగతాయారు అన్నారు. సంపూర్ణ పోషణ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని గురువారం వీరవాసరంలో సర్పంచి మంగతాయారు ప్రారంభించారు. సిడిపిఒ టి.లక్ష్మీకాంతం అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మంగతాయారు మాట్లాడారు. గర్భిణులు, బాలింతలు అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చి పోషకాహారం తీసుకోవాల్సిన అవసరం లేకుండా ఇంటి వద్దకే పోషకాహారం అందించడం ప్రభుత్వానికి ప్రజల పట్ల ఉన్న బాధ్యతను తెలియజేస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ ఈ పోషణ కిట్లు వాడుకుని ఆరోగ్యంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి మద్దాల వెంకటలక్ష్మి, వార్డు సభ్యులురాలు పి.కనకలక్ష్మి, అంగన్‌వాడీ సూపర్‌వైజర్‌ వి.కనకమహాలక్ష్మి, ఎఎన్‌ఎం ఆదిలక్ష్మి పాల్గొన్నారు.