ప్రజాశక్తి-పర్చూరు: పర్చూరు రోటరీక్లబ్ ఆధ్వర్యంలో మండలంలోని పోతుకట్ల, కొమర్నేనివారిపాలెం గ్రామాల్లో గర్భిణులకు 12 రకాల పౌష్టికాహార పదార్థాలను డాక్టర్ల సలహా మేరకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చెరుకూరు వైద్యశాల వైద్యాధికారి డాక్టర్ ఎం గౌతమ్ మాట్లాడుతూ గర్భిణులు పౌష్టికాహారం తీసుకోవాలని, క్యాల్షియం, ఐరన్ మాత్రలు తప్పని సరిగా తీసుకోవాలని సూచించారు. ప్రతి నెలా దగ్గరలోని డాక్టర్ల సలహాలను తీసుకోవాలని సూచించారు. ముఖ్య అతిథిగా పోతుకట్ల ఎంపిటిసి పంబి కిషోర్‌రెడ్డి మాట్లాడుతూ రోటరీ చేస్తున్న సేవలను కొనియాడారు. కార్యక్రమంలో రోటరీక్లబ్ అధ్యక్షులు నాగభైరు శ్రీనివాసరావు, కార్యదర్శి పంబి సదానంద రెడ్డి, ఆరోగ్య కార్యకర్తలు, ఆశ కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. అనంతరం పౌష్టికాహార ప్యాకెట్లను రోటరీ అధ్యక్షులు నాగభైరు శ్రీనివాసరావు దంపతులు గర్భిణులకు అందజేశారు.










