Sep 02,2023 22:28

ప్రజాశక్తి - పెనుమంట్ర
          ఎంఎల్‌ఎ చెరుకువాడ శ్రీరంగనాథరాజు స్ఫూర్తితో ఆసుపత్రిలో గర్భిణులకు, బాలింతలకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పెనుమంట్ర ఆరోగ్య కేంద్ర అభివృద్ధి కమిటీ ఛైర్మన్‌, ఎంపిపి కర్రి వెంకటనారాయణ రెడ్డి (వాసురెడ్డి) అన్నారు. స్థానిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణులకు, బాలింతలకు ప్రొటీన్‌ పౌడర్‌, బ్రెడ్‌, ఆపిల్‌ వంటి పౌష్టికాహారం కిట్లను ఎంపిపి కర్రి వెంకటనారాయణ రెడ్డి (వాసురెడ్డి) తల్లి కమల జ్ఞాపకార్థంగా పంపిణీ చేశారు. పొలమూరు, పెనుమంట్ర, మాముడూరుతో పాటు పలు గ్రామాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గరువు ఆరోగ్య కేంద్రంలో వాసురెడ్డి మాట్లాడుతూ సుమారు 14 నెలలుగా ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. గర్భిణులకు, బాలింతలకు ప్రతినెలా పౌష్టికాహారం అందిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ కె.లావణ్య, డాక్టర్‌ సంతోష్‌రెడ్డి, ఎఎంసి ఛైర్మన్‌ వెలగల వెంకటరమణ (మిస్సమ్మ), వైస్‌ ఎంపిపి వాసంశెట్టి కిరణ్‌, మండల కన్వీనర్‌ గూడూరి దేవేంద్రుడు, వైసిపి పెనుమంట్ర గ్రామ అధ్యక్షుడు తేతలి సుధీర్‌రెడ్డి, గరువు సర్పంచి ముదునూరి నాగరాజు, మండల సర్పంచుల ఛాంబర్‌ మండల అధ్యక్షుడు తమనంపూడి వీరెడ్డి, మండల వ్యవసాయ సలహా మండలి మండల కమిటీ ఛైర్మన్‌ కొవ్వూరి చిన్నారెడ్డి , మార్టేరు ఎంపిటిసి-1 కర్రి అనురాధ, జుత్తిగ, వెలగలవారిపాలెం ఎంపిటిసి సభ్యులు మాండ్రు శాంత కుమారి, వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.