Sep 30,2023 18:56

అవగాహనా కార్యక్రంలో పాల్గొన్న సిడిపిఒ

ప్రజాశక్తి-కందుకూరు :కందుకూరు ప్రాజెక్ట్‌ వలేటివరి పాలెం -2 సెక్టార్‌ పోషణ మాసొత్సవాలు ముగింపు కార్యక్రమంలో భాగంగా చేర్లోపల్లి అంగన్‌వాడీ సెంటర్లో సిడిపిఒ శర్మిష్ఠ అధ్యక్షతన పోషకాహార అవశ్యకతను గర్భిణులు, బాలింతలకు అవగాహన కల్పించారు. చిరుధాన్యాలు, ఆకుకూరలు, పండ్లు మనం తీసుకునే ఆహారం లో చేర్చాలని తెలియ పరిచారు. ఈ కార్యక్రమానికి సిడిపిఒ శర్మిష్ఠ , సూపర్‌వైజర్‌ సునీత, ఎ డబ్యు డబ్యు రమాదేవి, రాధ,స్కూల్‌ టీచర్స్‌ ,గర్భవతులు, బాలింతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.