ప్రజాశక్తి - ఆలమూరు
గర్భిణీలు, బాలింతలు, నవజాత శిశువుల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని ప్రభుత్వ విప్, ఎంఎల్‌ఎ చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. మండలంలోని కొత్తూరు సెంటర్లో ఫంక్షన్ హల్ నందు మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన నియోజకవర్గ స్థాయి పౌష్టికాహార వారోత్సవాలు ఎంపిపి తోరాటి లక్ష్మణరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ చిర్ల మాట్లాడుతూ మహిళల ఆరోగ్యం దష్ట్యా, పుట్టబోయే పిల్లలు ఆరోగ్యవంతంగా పుట్టాలనే ఆలోచనతో, పేద వర్గాల మహిళలకు పౌష్టికాహార లోపాలతో ఇబ్బందులు పడకూడదని ప్రభుత్వం వైయస్‌ఆర్ సంపూర్ణ పోషణ కిట్లను లబ్ధిదారులకు అందజేస్తుందన్నారు. అనంతరం అంగన్ వాడీ సిబ్బంది ఏర్పాటు చేసిన పోషకాహార ప్రదర్శనను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వైసిపి మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్, మాజీ ఎంపపి తోరాటి రాంబాబు, ఎఎంసి చైర్మన్ వై.నాగేశ్వరరావు, ఎంపిడిఒ కె.జాన్ లింకన్, సిడిపిఒ శారద, జిల్లా వెల్ఫేర్ కోఆర్డినేటర్ అనంత లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
అంగన్‌వాడీల సేవలు ఎనలేనివి
అంగన్‌వాడీ కేంద్రాలు నిర్వహణలో టీచర్లు, హెల్పర్లు సేవలు ఎనలేనివని ఎంపిడిఒ కె.జాన్ లింకన్, సిడిపిఓ పి.శారద అన్నారు. మండలంలోని కొత్తూరు సెంటర్లో ఉన్న ఫంక్షన్ హాల్ నందు ఐసిడిఎస్ ఆధ్వర్యంలో పౌష్టికాహార వారోత్సవాలు నియోజకవర్గ స్థాయిలో వారి పర్యవేక్షణలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా వెల్ఫేర్ కోఆర్డినేటర్ అనంతలక్ష్మి, ఎఒ రామ్ స్వరూప్, ఇఒపిఆర్‌డి రాజకుమార్ తదితరులు పాల్గొన్నారు.










