Aug 02,2023 17:56

గర్భిణీ స్త్రీలకు సీమంతం నిర్వహిస్తున్న దృశ్యం

గర్భిణిలు పౌష్టికాహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలి
ప్రజాశక్తి - పగిడ్యాల

     గర్భిణీ మహిళలు పౌష్టికారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలని జడ్పిటిసి పుల్యాల దివ్య, సర్పంచ్ పెరుమాళ్ళ శేషన్న ఎంపీడీవో వెంకటరమణ అన్నారు. బుధవారం మండల కేంద్రం పగిడ్యాల లో అంగన్వాడి కేంద్రం2 లో గర్భిణీ మహిళలకు  సీమంతం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు.  మహిళలు గర్భం దాల్చినప్పటి నుంచి తప్పకుండా తమ పేర్లను అంగన్వాడి కేంద్రంలో నమోదు చేసుకోవాలన్నారు. ప్రతినెల గర్భిణీ మహిళలకు  అంగన్వాడి కేంద్రంలో పౌష్టికాహారం అందించడం జరుగుతుందన్నారు. అంగన్వాడి కేంద్రంలో అందించే పౌష్టికాహారాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గర్భిణీ మహిళలు  తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో తహశీల్దార్ భారతి, ఎంఈఓ సుభాన్, ఈ ఓ ఆర్ డి నాగేంద్రయ్య, అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు, గర్భిణీ మహిళలు పాల్గొన్నారు.