ప్రజాశక్తి -హుకుంపేట::గర్భిణి తీవ్ర రక్తస్రావంతో అస్వస్థతకు గురి కావడంతో సొంత ఆటోలోనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించిన ఘటన హుకుంపేట మండల తీగలవలస పంచాయతీ వై గరుడపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ప్రకారంగా పాంగి రాంబాబు భార్య రాములమ్మ మూడు నెలల గర్భవతి ఆమెకు అకస్మికంగా తీవ్ర రక్తస్రావం ఏర్పడుతూ అస్వస్థతకు గురి కావడంతో కుటుంబీకులు గ్రామస్తులు 108 సిబ్బందికి ఫోన్ చేసి సమాచారం అందించారు. అంబులెన్స్ గ్రామానికి రాకపోవడంతో అధిక రక్తస్రావం అవడంతో సొంత ఆటోలో ఆశ వర్కర్లు, అంగన్వాడి టీచర్లు, కుటుంబ సభ్యులు కలిసి పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందించారు.రహదారి సౌకర్యం ఉండి కూడా అంబులెన్స్ రాకపోవడం విశారకరమని సిపిఎం మండల కార్యదర్శి వి.లక్ష్మణరావు అన్నారు.










