Jun 10,2023 20:49

రోడ్డుకు భూమి పూజ చేస్తున్న వైసిపి నాయకులు

ప్రజాశక్తి - చిప్పగిరి
మండలంలోని ఏరూరు గ్రామం నుంచి బంటనహాల్‌ గ్రామానికి గ్రావెల్‌ రోడ్డుకు శనివారం భూమిపూజ చేశారు. ఆలూరు మార్కెట్‌ యార్డు ఛైర్మన్‌ గుమ్మనూరు నారాయణ, చిప్పగిరి ఎంపిపి హేమలత మారయ్య, వైసిపి మండల కన్వీనర్‌ ఏరూరు రంగస్వామి భూమి పూజ చేసి గ్రావెల్‌ రోడ్డు పనులను ప్రారంభించారు. అనంతరం వైసిపి మండల్‌ కన్వీనర్‌ ఏరూరు రంగస్వామి మాట్లాడారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్‌ ఆదేశాల మేరకు ఆలూరు మార్కెట్‌ యార్డు ఛైర్మన్‌ గుమ్మనూరు నారాయణ, ఎంపిపి జూటూరు హేమలత మారయ్య సహకారంతో ఏరూరు గ్రామ ప్రజల అభ్యర్థన మేరకు ఏరూరు గ్రామం నుంచి బంటనహాల్‌ రైల్వేస్టేషన్‌ వరకు సుమారు 5.5 కిలోమీటర్లు గ్రావెల్‌ రోడ్డును ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆలూరు మార్కెట్‌ యార్డు ఛైర్మన్‌ గుమ్మనూరు నారాయణ, వైసిపి యువ నాయకులు జూటూరు మారయ్య మాట్లాడుతూ... రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్‌ సహకారంతో మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని తెలిపారు. వైసిపి నాయకులు రాజన్న, శ్రీధర్‌, షేకన్న, బాలకృష్ణ, సతీష్‌, పరమేష్‌ పాల్గొన్నారు.