
ప్రజాశక్తి- అనకాపల్లి
అనకాపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ సమావేశం బుధవారం అధ్యక్షురాలు పలకా యశోద రవి అధ్యక్షతన మార్కెట్ యార్డ్ పరిపాల భవనంలో జరిగింది. ఈ సమావేశంలో పలు తీర్మానాలను కమిటీ సభ్యులు ఆమోదించారు. మార్కెట్ యార్డ్ తూర్పు భాగంలో ప్రహరీ నిర్మాణం, అనకాపల్లి, కసింకోట మండలాల్లోని ఒక్కొక్క గ్రామానికి రూ.2 లక్షల చొప్పున 20 గ్రామాల్లో గ్రావెల్ రోడ్లు వేయడానికి బడ్జెట్ మంజూరు కొరకు, మెయింటెనెన్స్ కొరకు రూ.10 లక్షల మంజూరు కొరకు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ కమిషనర్‌కు ప్రతిపాదనలు పంపించడానికి తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ కార్యదర్శి డి శకుంతల, ఉపాధ్యక్షులు కరక సోమినాయుడు, మెంబర్లు నీటిపల్లి లక్ష్మి, మరిపల్లి శోభ, బొబ్బిలి శ్యామల, ఈగల నూకరత్నం, దాడి తులసి కుమారి, బొడ్డు అచ్చిరాజు, పిట్ట అప్పలరాజు, తెరపల్లి నాగ సంతోష్ కుమార్, దాడి కుమార్ కృష్ణ, ఒమ్మి మధుబాబు, కొణతాల విజరు కుమారి, గుండా రమేష్ గుప్తా, గొంతిన శివ, ఏడి అగ్రికల్చర్ అధికారులు పాల్గొన్నారు.