గ్రావెల్ దోపిడీదారులను అరెస్టుచేయాలి
ప్రజాశక్తి-కావలి : యథేచ్ఛగా గ్రావెల్ దోచుకుంటున్న వారిపై పీడీ యాక్ట్ పెట్టి అరెస్టు చేయాలని, వందల ఎకరాల భూములను కాపాడాలని దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షులు మల్లి, కొంతమందితో కలిసి శుక్రవారం కావలి ఆర్‌డిఒ కార్యాలయంలో జరిగిన'' జగనన్నకు చెబుదాం'' కార్యక్రమంలో జెసికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కావలి డివిజన్లో వందల ఎకరాల ప్రభుత్వ భూములను సర్వనాశనం చేస్తున్న గ్రావెల్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకొని వందల ఎకరాల భూములను పేదలకు దక్కాల్సిన భూములు గ్రావెల్ మాఫియా వారు ప్రభుత్వ కనుసన్నల్లో కోట్ల రూపాయలు గడిస్తున్నారన్నారు. ఆ భూములు ఎందుకు పనికి రాకుండా పోతున్నాయని తెలియజేశారు. రుద్రకోటలో 150 ఎకరాలలో దాదాపు 15 మీటర్లు ఎత్తున తవ్వేశారని తెలియజేశారు. అందువల్ల ఆ భూములు ఎందుకు పనికిరాకుండా పోతున్నాయని తెలియజేశారు. భూములను సర్వనాశనం చేస్తున్నారని తెలియజేశారు. ఆములూరులో 200 ఎకరాలు వరకు గ్రావెల్ తవ్వుకొని కొన్ని కోట్ల రూపాయలు గడించారని తెలియజేశారు. కె.కె.గుంటలో దాదాపు 100 ఎకరాలు ఇప్పుడు విమానాశ్రయ భూముల్లో కూడా గ్రావెల్ తీసుకొని పోతున్నారని తెలియజేశారు. అది అధికార పార్టీ అండదండలతోనే జరుగుతుందన్నారు. ఎంతమంది దళితులు గిరిజనులు భూమిలేని వెనుకబడిన వర్గాల వారికి దక్కాల్సిన ఆ భూములు మాఫియా వల్ల సర్వ నాశనం అయిపోతున్నాయని తెలియజేశారు. ఎందుకు పనికిరాకుండా పోతున్నాయన్నారు. అవి గ్రామాల పక్కనే ఉండటం వల్ల పశువులకు, మనుషులకు పనికి రాకుండా పోయి, ప్రమాదకరంగా తయారయ్యాయని తెలియజేశారు. ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకునే నాథుడే లేడని పేర్కొన్నారు. అంతర్జాతీయ మానవ హక్కుల సంఘానికి చెప్పిన పట్టించుకునే నాథుడే లేరని, అధికారులు చెబుతున్నారని తెలిపారు. వీటిపై సమగ్ర విచారణ జరిపించి వారి ఆగడాలను అరికట్టి, వారికి ఇచ్చే కోట్ల రూపాయల రాయితీలు వసూలు చేయాలని కోరారు. కార్యక్రమంలో జరుగుమల్లి విజయరత్నం, లక్ష్మి నర్సు, మోహన్‌రావు, చౌటూరి వెంకట రత్నం, తదితరులు పాల్గొన్నారు.










