యంత్రాన్ని ఇస్తున్న సింహాద్రప్పడు
ప్రజాశక్తి-కోటవురట్ల:మండల కేంద్రంలో పశు వైద్యశాల వద్ద మండలానికి సంబంధించి ఐదు పశుగ్రాస్ కటింగ్ యంత్రాలు అందజేసినట్లు స్థానిక పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు సింహాద్రప్పడు తెలిపారు. దాదాపు 34 వేల విలువగల యంత్రాన్ని రూ.13500 సబ్సిడీతో 20,300లకు అందజేశామని తెలిపారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గడ్డి కత్తిరించి యంత్రాలు వినియోగించడంతో పశుదాన, పశుగ్రాసం ఆదా అవుతుందని తెలిపారు. పసుశులు సునాయాసంగా మేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. అనంతరం సిబ్బందితో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ, పాడి పశువులకు వచ్చే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండి సకాలంలో వైద్య సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు పశువైద్యులు పాల్గొన్నారు..










