Sep 05,2023 20:45

నూతన సచివాలయాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి

లక్కిరెడ్డిపల్లి : గ్రామ స్వరాజ్యమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని అనంతపురం గ్రామం ఈడిగ పల్లెలో గ్రామ సచివాలయ నూతన భవనాన్ని శ్రీకాంత్‌రెడ్డి ప్రారంభిం చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిఎం జగన్‌ గ్రామ సచి వాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి దేశంలో ఎక్కడా లేని విధంగా పార దర్శకంగా, ప్రతిష్టాత్మకంగా గ్రామ స్థాయిలోనే ప్రజలకు సేవలందిస్తున్నారు. ప్రజా అవసరాల నిమిత్తం మండల, జిల్లా కేంద్రాలకు వెళ్లే అవసరం లేకుండా వ్యయ, ప్రయాసలు లేకుండా చేశారన్నారు. .గ్రామ సచివాల యాలకు కోట్లాది రూపాయలుతో శాశ్విత కార్యాలయ భవనాలను నిర్మించి పల్లెల మార్పుకు శ్రీకారం చుట్టారన్నారు.
ప్రతి గ్రామంలో సిమెంటు రోడ్లు
ఈడిగపల్లి లో రూ.10 లక్షల నిధులతో పూర్తయిన సిమెంట్‌ రోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్యే శ్రీకాంత్‌ రెడ్డి స్థానిక ప్రజా ప్రతినిధు లతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి మద్దిరేవుల సుదర్శన్‌రెడ్డి, మాజీ ఎంపిపి అంబాబట్టిన రెడ్డయ్య, మండల ఉపాధ్యక్షుడు సమరసింహారెడ్డి, కో-ఆప్షన్‌ సభ్యులు సయ్యద్‌అమీర్‌, సర్పంచ్లు వెంకటనారాయణరెడ్డి, గడ్డం కళ్యాణి ప్రభాకర్‌ రెడ్డి, గంగమ్మ ఆలయ చైర్మన్‌ నరసింహారెడ్డి, ఉప సర్పంచ్‌ రాజబాబు, సింగల్‌ విండో డైరెక్టర్‌ రెడ్డయ్య పాల్గొన్నారు.