
గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలి: టిడిపి
ప్రజాశక్తి పగిడ్యాల
గ్రామాలలోని వార్డు స్థాయి నుంచి టిడిపి పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని టిడిపి నంద్యాల పార్లమెంట్ ఇంచార్జి మాండ్ర శివానందరెడ్డి పోలింగ్ బూత్ కమిటీ సభ్యులకు సూచించారు. గురువారం మండల కేంద్రం పగిడ్యాల లో టిడిపి నాయకుడు పుల్యాల రాజశేఖర్ రెడ్డి నివాసంలో కుటుంబ సాధికార సారధులు కార్యక్రమంలో భాగంగా మండల టిడిపి బూత్ కమిటీ సభ్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాండ్ర శివానందరెడ్డి మాట్లాడారు. టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన మినీ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. టిడిపి అధికారంలోకి వస్తే ఏ పథకాలు అందిస్తుంది దాని వలన కుటుంబంలో ఎంతమందికి మంచి జరుగుతుంది అని ఇంటింటికి తిరిగి అవగాహన కల్పించాలన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం అభివృద్ధి చెందడమే కాక రాష్ట్ర ప్రజలకు మంచి భవిష్యత్తు ఉంటుందని ఇంటింటి తిరిగి ప్రజలకు సూచించాలన్నారు. భవిష్యత్తుకు గ్యారెంటీ, బాబు షూరిటీ కార్యక్రమాలను ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో నిర్వహించాలన్నారు. టిడిపి గెలుపు కోసం ప్రతి ఒక్క కార్యకర్త సైనికుల పనిచేయాలని. భవిష్యత్తుకు గ్యారెంటీ బాబు షూరిటీ కార్యక్రమాలను ఇంతవరకు ప్రజల్లోకి తీసుకెళ్లారు అని బూతు కమిటీ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఒక ఇల్లు కూడా తప్పిపోకుండా ప్రతి ఇంటికి తిరిగి ప్రతి వ్యక్తిని కలిసి వైసిపి ప్రభుత్వం చేపడుతున్న వ్యతిరేక విధానాలను ప్రజలకు చెప్పి అలాగే నారా చంద్రబాబునాయుడు ప్రవేశపెట్టబోయే మేనిఫెస్టో గురించి పూర్తిస్థాయిలో ఓటర్లకు వివరించాలని బూతు కమిటీ సభ్యులకు దిశా దశ నిర్దేశించారు. ఈ టిడిపి నాయకులు జయసూర్య, పుల్యాల రాజశేఖర్ రెడ్డి, వాసు రెడ్డి, దామోదర్ రెడ్డి, సిరి గౌడ్, రామిరెడ్డి, మండల కన్వీనర్ పలుచాని మహేశ్వర్ రెడ్డి, వెంకటేశ్వర్లు, పగడం శేఖర్, చిన్న, టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.