
ప్రజాశక్తి ధర్మవరం టౌన్ : జనసేన పార్టీని గ్రామ స్థాయినుంచి బలోపేతం చేద్దామని ఆ పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి చిలకం మధుసూదన్‌రెడ్డి నాయకులకు, కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. ఈ మేరకు ఆయన బుధవారం స్వగృహంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. అంతకు ముందు మండలంలోని ఉప్పునేశనపల్లి గ్రామానికి చెందిన సాకే రామాంజినేయులు, సాకేహేమంత్, గుజ్జల రాజు, బాలగొండ గోవర్దన్, కత్తే ప్రసన్నకుమార్, గుజ్జల వినరు, సాకే యుగంధర్ తదితరులు చిలకం మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో జనసేన పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా చిలకం మాట్లాడుతూ జనసేన పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పెద్దిరెడ్డిగారి ఆదర్శ్, చిలకం సుధాకర్‌రెడ్డి, చిగిచెర్ల బాష తదితరులు పాల్గొన్నారు.