Jun 19,2023 01:06

సత్తెనపల్లి రూరల్‌: రోడ్డుపై ఏర్పడిన గుంతలను గ్రామస్తులే పూడ్చు కున్నారు. సత్తెనపల్లి మండలం గర్నెపూడి నుండి మేడి కొండూరు మండలం శిరిపురం వరకు వున్న తారు రోడ్డు ధ్వంసమె.. రోడ్డుపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. సుమారు మూడేళ్లుగా ఈ రోడ్డు పరిస్థితి ఇదే విధంగా ఉంది. దీంతో, ప్రజలు, ముఖ్యంగా విద్యార్థులు అవస్థలు పడు తున్నారు. రోడ్డు నిర్మాణం చేపట్టాలని తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి దృష్టికి తీసుకెళ్ళిన పట్టించు కోలేదు. ప్రజాప్రతినిధులు అధి కారులు చుట్టూ తిరిగిన గ్రామస్తులు అలసిపోయారు. పాఠశాలలు తిరిగి ప్రారం భం కావడంతో విద్యార్థులు వెళ్ళేందుకు ఇబ్బంది పడు తున్నారు. గర్నెపూడి గ్రామస్తులు చందాలు వేసుకుని సుమారు రెండు కిలోమీటర్ల వరకు రోడ్డు పై ఏర్పడ్డ గుంతలను పొక్లెయిన్‌ సాయంతో పూడ్చారు.