ప్రజాశక్తి-ఆదోనిరూరల్
మండలంలోని విరుపాపురం పంచాయతీ ఉత్తమ పంచాయతీగా ఎంపిక కావడం గ్రామస్తుల కృషి అని సర్పంచి ప్రహ్లాద్ యాదవ్ తెలిపారు. సోమవారం జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా కర్నూలు నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఉత్తమ సేవలు అందించిన పంచాయతీలకు అవార్డులు అందజేశారు. కలెక్టర్ డాక్టర్ జి.సృజన, జడ్‌పి ఛైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, జడ్‌పి సిఇఒ నాసర రెడ్డి, డిపిఒ నాగరాజు నాయుడు చేతుల మీదుగా అవార్డు అందుకోవడం ఆనందంగా ఉందని సర్పంచి ప్రహ్లాద్ యాదవ్ తెలిపారు. పంచాయతీ కార్యదర్శుల విధులు నిర్వహిస్తున్న పంచాయతీ కార్యదర్శి వేణుగోపాల్‌కు కూడా అందజేశారు. సర్పంచి ప్రహ్లాద్ యాదవ్ గ్రామస్తుల సహకారంతో గ్రామానికి కావాల్సిన మౌలిక వసతులను వంద శాతం ఏర్పాటు చేసి గ్రామాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. వైసిపి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలతో పాటు, ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, యువ నాయకులు జయ మనోజ్ రెడ్డి, మండల స్థాయి అధికారుల సహకారంతో ప్రజలను భాగస్వామ్యం చేసుకుని గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారు.
అవార్డును అందుకుంటున్న సర్పంచి ప్రహ్లాద్ యాదవ్










