Oct 11,2022 23:34

గ్రామసభలో మాట్లాడుతున్న ఎంపిటిసి రాజ్‌కుమా ర్‌

ప్రజాశక్తి-చింతూరు
మండలంలోని కుమ్మూరు గ్రామంలో మంగళవారం జరిగిన గ్రామసభలో ఎంపీటీసీ వేక రాజ్‌ కుమార్‌ పలు సమస్యలపై అధికారులను నిలదీశారు. గ్రామంలో వీధిలైట్లు, రోడ్లు, చేతిపంపు ప్రెస్సింగ్‌, బోర్లు వంటి సమస్యలపై ప్రశ్నించారు. జల్‌ జీవన్‌ స్కీము పూర్తయినా ప్రతి ఇంటికి నీరు అందడం లేదని మండిపడ్డారు. కుమ్మూరు పంచాయతీలోని సమస్యలను వారం రోజుల్లో పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కుమ్మూరు సెక్రటరీ, సర్పంచి, ఉప సర్పంచ్‌ మారయ్య, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, అధికారులు పాల్గొన్నారు.