Oct 20,2022 23:20

ఫిర్యాదు చేశారు.


ప్రజాశక్తి-ముంచంగిపుట్టు:
మండలంలో బూసిపుట్టు గ్రామ పంచాయతీలో స్థానిక సర్పంచ్‌ కిల్లో రాజమ్మ ఆధ్వర్యంలో గురువారం గ్రామసభను నిర్వహించారు. పంచాయతీ పరిధిలో పలు గ్రామాల నుండి వచ్చిన ప్రజలు సమస్యలపై ధ్వజమెత్తారు. గ్రామాలలో తాగునీటి, వీధి దీపాలు, రోడ్డు నిర్మాణాలు చేపట్టాలన్నారు. ఐటీడీఏ పీవో సందర్శించినప్పుడు రహదారుల నిర్మాణాలు, ఉద్యాన పంటలకు మొక్కలు పంపిణీ చేస్తామని హామీ అమలు కాలేదన్నారు. సచివాలయ సిబ్బంది ఒక్క రోజు కూడా పంచాయతీలో పర్యటించ లేదని ఫిర్యాదు చేశారు. ఈ గ్రామసభ లో ఉప సర్పంచ్‌ కిలో దేర్కు, మాజీ సర్పంచ్‌ మంగళన్న, జలంధర్‌ గణపతి, జయరాం, వెంకట్రావు, మోహన్‌ వార్డు మెంబర్లు, పంచాయతీ సెక్రెటరీ గోపి, సచివాలయ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారు.