Aug 25,2023 22:17

ప్రజాశక్తి - ఆగిరిపల్లి
    కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జల జీవన్‌ మిషన్‌ కార్యక్రమంలో భాగంగా మండల పరిధిలోని నూగొండపల్లి, పోతవరప్పాడు గ్రామాలు హర్‌ఘర్‌ జల్‌ గ్రామాలుగా గ్రామ సభలో సర్పంచిలు కందుల మల్లీశ్వరీ, తోటకూర సత్యవాణిలు ప్రకటించారు. తమ గ్రామాలల్లో ప్రతీ ఇంటికీ నీటి కుళాయిలు వున్నట్లుగా వారు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి సిహెచ్‌.పుల్లారావు, గ్రామ నీరు, పారిశుధ్య కమిటీ సభ్యులు పాల్గొన్నారు.