ప్రజాశక్తి-విజయనగరం : గ్రామంలో ఆధిపత్యం కోసం, ఆర్థికంగా నష్టపరిచాడన్న కారణంతో తెర్లాం మండలం ఉద్దవోలు గ్రామానికి చెందిన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు ఏగిరెడ్డి కృష్ణను ప్రత్యర్థులు హత్య చేశారని ఎస్‌పి ఎం.దీపిక తెలిపారు. హత్యకు పాల్పడిన నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో హత్యకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
ఏగిరెడ్డి కృష్ణ గ్రామంలో క్రియాశీలకంగా వ్యవహరించేవారు. గత కొన్నేళ్లగా అదే గ్రామానికి చెందిన మరడాన వెంకట నాయుడు కుటుంబంతోగ్రామంలో ఆధిపత్యం కోసం గొడవలున్నాయి. గ్రామంలో కొన్ని భవనాలను నిర్మించేందుకు మరడాన
వెంకట నాయుడు కాంట్రాక్టు పనులు చెయ్యగా, బిల్లులు మంజూరు కాకుండా కృష్ణ అడ్డుపడినట్లు అనుమానించారు. దీంతో మరడాన వెంకట నాయుడు సుమారు రూ.2 కోట్లు వరకు అప్పులపాలయ్యాడు. తనను ఆర్థికంగా నష్టపర్చిన వ్యక్తిని చంపితేనే, అతనిపై తమ కక్ష తీరడంతోపాటు, ఉద్దవోలు గ్రామంలో ఆధిపత్యం సాధించవచ్చునని భావించారు. ఇందుకుగాను, తమ కుటుంబ సభ్యులతో కలిసి,కుట్ర పన్ని, పథకం ప్రకారం ఉపాధ్యాయుడు కృష్ణను హత్య చేసేందుకు రెక్కీ నిర్వహించారు. ప్రతీ రోజూ రాజాం నుండిఏగిరెడ్డి కృష్ణ తాను పని చేస్తున్న కాలంరాజుపేట గ్రామంలోని ఎంపియుపి. స్కూలుకు ఉదయం మోటారు సైకిలుపైవెళ్తుతుంటారని గుర్తించారు. కృష్ణను హత్య చేయడంలో భాగంగా ఆదివారం ఉదయం ఆయన ఇంటివద్ద మరడాన వెంకట నాయుడు మాటువేసి రెక్కీ నిర్వహించాడు. ఆయన బైక్‌పై బయలుదేరిన సమాచారాన్ని అతని సోదరుడు మరడాన మోహనరావుకు అందించారు. నిందితులు మరడానమోహనరావు, రెడ్డి రాము కలిసి బొలేరో వాహనంతో కృష్ణను వెంబడించారు. కృష్ణ రాజాం మండలం కొత్తపేట వద్దకు చేరేసరికి మరడాన మోహనరావు బొలోరో వాహనంతో వెంబడించి వెనుక నుంచి ఢకొీట్టాడు.అనంతరం వాహనాన్ని ఆపి, కృష్ణ చనిపోయింది? లేనిది? చూసి, చనిపోలేదని నిర్ధారించుకొని, అతని ముఖంపై ఇనుప రాడ్డుతో విచక్షణారహితంగా కొట్టి, చంపేసారు. నిందితులు బొలోరో వాహనాన్ని సంఘటనా స్థలంలోనే విడిచిపెట్టి పరారీ అయ్యారు. ఈ కేసులో దర్యాప్తును ప్రారంభించిన రాజాం పోలీసులు కృష్ణ హత్యలో ప్రధాన పాత్ర పోషించిన మరడాన మోహనరావు, రెడ్డి రాము , మరడాన వెంకటనాయుడు, మరడాన రామస్వామిలను అరెస్టు చేసి, రిమాండుకు తరలించారు.
గ్రామంలో పోలీసు పికెట్
ఉద్దవోలు గ్రామంలో శాంతియుత వాతావరణం నెలకొనేందుకు డిఎస్‌పి, సిఐల ఆధ్వర్యంలో పోలీసు పికెట్
ను ఏర్పాటు చేసినట్లు ఎస్‌పి తెలిపారు. కృష్ణ హత్యలో భాగస్వామ్యం ఉన్న వారందరినీ నిందితులుగా చేర్చామని, పరారీలో ఉన్న ఉన్న నిందితుడు మరడాన గణపతిని కూడా త్వరలో అరెస్టు చేసి, సాక్ష్యాలను, సాంకేతిక ఆధారాలను సేకరించి నిందితులకు శిక్షపడేలా చర్యలు చేపడతామని ఎస్‌పి తెలిపారు. మీడియా సమావేశంలో డిఎస్‌పి ఎ. శ్రీనివాస చక్రవర్తి,రాజాం సిఐ కె.రవికుమార్, చీపురుపల్లి సిఐ జి.సంజీవరావు, సిసిఎస్ సిఐ బుచ్చిరాజు, ఎస్‌బి సిఐలు జి.రాంబాబు,
ఇ. నర్సింహమూర్తి పాల్గొన్నారు.










