Sep 04,2023 20:54

సచివాలయాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి

లక్కిరెడ్డిపల్లి : గ్రామీణాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం మండల పరిధిలోని బి.యర్రగుడి గ్రామ సచివాలయ నూతన భవనాన్ని ఎంపిపి మద్దిరే వుల సుదర్శన్‌ రెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కర్ణపు విశ్వనాధ రెడ్డి, మాజీ ఎంపిపి అంపాబత్తిన రెడ్డెయ్య, సింగల్‌ విండో అధ్యక్షుడు యర్రమరెడ్డి, సర్పంచ్‌ రెడ్డెయ్య ,ఎంపిటిసి లక్ష్మీనా రాయణ ,స్థానిక నాయకులుతో కలసి శ్రీకాంత్‌ రెడ్డి ప్రారం భించారు. భవన నిర్మాణాలపై సంతప్తి వ్యక్తం చేశారు. సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీకాంత్‌ రెడ్డి మాట్లాడుతూ ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయ, వాలంటీర్‌ వ్యవస్థ ప్రజల ముంగిటకే సేవలు అందిస్తూ భరోసాని స్తోందన్నారు. సచివాలయ అధికారులు, సిబ్బంది , వాలంటీర్లు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధులుగా పనిచేస్తున్నారన్నారు. మన రాష్ట్రంలో అమలవుచున్న సచివాలయ వ్యవస్థ ఇతర రాష్ట్రాలు, దేశాలకు ఆదర్శంగా నిలుస్తోందన్నారు. నిర్దేశిత సమయం కన్నా ముందుగానే ప్రజలకు సేవలు అందు తున్నాయన్నారు.సచివాలయాల్లో జవాబుదారితనం, పారద ర్శకంగా సేవలు అందుతున్నాయన్నారు.ప్రజల సమ స్యలపై సచివాలయ అధికారులు దష్టి పెట్టాలని ఆయన సూచిం చారు. మారుమూల గ్రామాలలోని సచివాలయాలకు సైతం ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పించడం జరుగుతోందన్నారు. ముఖ్య మంత్రి వైఎస్‌. జగన్మోహన్‌రెడ్డి సంక్షేమ, అభివద్ధి పథకాలును చేపట్టి తనదైన ముద్ర వేసుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలోజిల్లా ఎంపిపిల సంఘం అధ్యక్షులు మద్దిరేవుల సుదర్శన్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కర్ణపు విశ్వనాథరెడ్డి, మాజీ ఎంపిపి అంబాబత్తిన రెడ్డయ్య, సింగిల్‌ విండో ప్రెసిడెంట్లు ఎర్రం రెడ్డి, సిద్ధక రామచంద్రారెడ్డి, మండల కోఆప్షన్‌ సభ్యులు సయ్యద్‌ అమీర్‌, మండల ఉపాధ ్యక్షుడు సమరసింహారెడ్డి, గంగమ్మ ఆలయ చైర్మన్‌ నరసిం హారెడ్డి, ఎంపిటిసిలు పోలిరెడ్డి సుబ్బారెడ్డి, లక్ష్మీనారాయణ, జగన్మో హన్‌రెడ్డి, సుబ్బరాయుడు, సర్పంచ్‌లు రెడ్డయ్య, జనార్దన్‌ రెడ్డి, వెంకటనారాయణరెడ్డి, రమణయ్య, మహేంద్రబాబు, మాజీ ఎంపిటిసిలు రాజేంద్రనాథ్‌రెడ్డి, మాజీ సర్పంచులు కొండా ప్రసాద్‌రెడ్డిలు పాల్గొన్నారు.