Feb 07,2023 22:51

ప్రజాశక్తి-ఎడ్యుకేషన్‌: గ్రామీణ ప్రాంత విద్యార్థులను కూడా సివిల్స్‌లో ర్యాంకు సాధించే విధంగా శిక్షణ అందిస్తున్నామని శరత్‌ చంద్ర ఐఎఎస్‌ అకాడమి మేనేజింగ్‌ డైరెక్టర్‌ తోట శరత్‌ చంద్ర అన్నారు. ఎం.జి.రోడ్డులోని శరత్‌ చంద్ర ఐఎఎస్‌ అకాడమి ఇటీవల రాష్ట్ర గవర్నర్‌ చేతుల మీదుగా గ్లోబల్‌ అవార్డు తీసుకున్న సందర్భంగా మంగళవారం విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సివిల్స్‌తో పాటు గ్రూప్‌ -1 పరీక్షలలోనూ ఎంతో మందికి శిక్షణ అందించడంతో ర్యాంకులు సాధించి వివిధ ప్రభుత్వ సంస్థలలో స్థిరపడ్డారని అన్నారు. తమ సంస్థ చేస్తున్న కృషిలో భాగంగా రాష్ట్ర గవర్నర్‌ చేతుల మీదుగా గ్లోబల్‌ అవార్డును అందించారన్నారు. అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందని, తనపై ఇంకా బాద్యత పెంచిందని రానున్న కాలంలో ఇంకా ఉత్సాహంగా కృషి చేస్తూ ఎంతో మంది గ్రామీణ ప్రాంతాలకు చెందిన తెలుగు విద్యార్థులకు సివిల్స్‌లో శిక్షణ ఇచ్చి ఐఎఎస్‌లుగా తీర్చిదిద్దాలనేది తన కల అన్నార. ఆవిధంగా కృషి చేస్తామని తెలిపారు. అలాగే ఇటీవల సివిల్స్‌లో కూడా తమ విద్యార్థులు జాతీయస్థాయిలో ర్యాంకులు సాధించారని తెలిపారు. గ్రూప్‌ -1 ఫలితాలలో కూడా తమ విద్యా సంస్థ నుంఇ 40 మంది అభ్యర్థులు వివిధ ప్రభుత్వ సంస్థలకు ఎంపికయ్యారని తెలిపారు. ఈసమావేశంలో కళాశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.