May 24,2023 23:53

మాట్లాడుతున్న వైద్యులు



ప్రజాశక్తి-నర్సీపట్నం టౌన్‌: స్థానిక ఉమా నారాయణ చిన్నపిల్లల హాస్పటల్‌ ప్రాంగణంలో చిన్నపిల్లల ఆరోగ్యం, స్త్రీ గర్భవ్యాధులపై బిహెచ్‌ఎంపిఏ అవగాహన సదస్సు బుధవారం నిర్వహించారు. వైద్యులు పుల్లేటికుర్తి మల్లికార్జున్‌ రావు, వందన, ఎంఎస్‌ రాజు పాల్గొన్నారు ముఖ్యఅతిథి రాష్ట్ర అధ్యక్షులు కరేళ్ల గణపతి రావు మాట్లాడుతూ, ఆర్‌ఎంపి, పిఎంపీలకు గుర్తింపు లేదన్నారు.వీరికి శిక్ష ఇచ్చి ప్రభుత్వ వైద్య ఆరోగ్య కార్యకర్తలుగానూ, హెల్త్‌ ప్రొవైడర్స్‌గానూ చేయాలని డిమాండ్‌ చేసారు. 50 సంవత్సరాలు దాటిన సీనియర్‌ లకు 5000 రూపాయలు పెన్షన్‌ అందజేయాలని కోరారు. . ఈ విషయంపై ప్రభుత్వానికి అనేకమార్లు వినతిపత్రాలు అందజేసామని, నేటికీ స్పందన లేదన్నారు. గ్రామీణ వైద్యులకు జాతి స్థాయిలో గుర్తింపు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు కరేళ్ల గణపతి సత్యనారాయణ, ఉమ్మడి జిల్లా సెక్రెటరీ నేరెళ్ల సత్యనారాయణ, మండల అధ్యక్షులు, ఉమ్మడి జిల్లాల గ్రామీణ వైద్యులు పాల్గొన్నారు. ఆర్ట్స్‌ యూనివర్సిటీ మ్యాజిక్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌లో డాక్టరేట్‌ అవార్డు గ్రహీత లక్ష్మణరావు దంపతులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్‌ఎంపీలు, జిల్లా అసోసియేషన్‌ సభ్యులు పాల్గొన్నారు.