ప్రజాశక్తి -ఆనందపురం : మండలంలోని పెద్దిపాలెం పారడైజ్ ఫంక్షన్ హాల్‌లో గ్రామీణ వైద్యుల సంఘం ఆధ్వర్యాన ఒయాసిస్ ఫెర్టిలిటీ మెడికల్ ఇనిస్టిట్యూట్ సమక్షంలో భీమిలి నియోజకవర్గం గ్రామీణ వైద్యులకు (ఆర్‌ఎంపి) ఐవిఎఫ్‌పై మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ఒయాసిస్ మెడికల్ ఇనిస్టిట్యూట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మహతి మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాలలో పిల్లలు లేక బాధపడుతున్న వారికి అత్యాధునిక వైద్య విధానంతో ఆ లోపాన్ని సవరించుకోవచ్చన్నారు. వీటిపై అవగాహన పెంచుకొని గ్రామీణ ప్రాంతాల్లో చైతన్యం తీసుకురావాలన్నారు. ఈ సదస్సుకు ఆర్‌ఎంపి ఉత్తరాంధ్ర అధ్యక్షుడు, రాష్ట్ర ఫెడరేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ జంగం జోషి, ఇనిస్టిట్యూట్ క్లస్టర్ మేనేజర్స్ సంతోష్‌కుమార్, సతీష్, మూడు మండలాల ఆర్‌ఎంపిల నాయకులు కెఎన్.రావు, సుధాకర్‌రెడ్డి, మంగ శివప్రసాద్, మహిళా అధ్యక్షులు సుగునేశ్వరి, మీసాల వెంకటరమణ, ఇమంది రామకృష్ణ, పచ్చి పులుసు కనకారావు, కోటి తదితరులు పాల్గొన్నారు.










