గ్రామీణ తపాలా ఉద్యోగుల నిరసన
ప్రజాశక్తి -చౌడేపల్లి: తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గ్రామీణ తపాలా ఉద్యోగులు బుధవారం స్థానిక తపాలా కార్యాలయం ముందు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పుంగనూరు బ్రాంచ్ అధ్యక్షుడు కే కష్ణమూర్తి ప్రసంగిస్తూ కమలేష్ చంద్ర కమిటీ సిఫార్సు చేసిన బంచింగును కేంద్ర ప్రభుత్వం వెంటనే అమలు పరచాలన్నారు గ్రామీణ తపాలా ఉద్యోగుల సమస్యలపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని విడచి పెట్టాలన్నారు. ఎనిమిది గంటల పని, పెన్షన్ తో సహా అన్ని ప్రయోజనాలను మంజూరు చేయాలని గ్రాడ్యుటీ రూ. 5 లక్షలకు పెంచాలని తమ సమస్యలను కేంద్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు కష్ణమూర్తి , సుబ్రమణ్యం, ముద్దప్ప, విజరు, అయ్యాక నరసింహులు, సుమలత, జనార్ధన, నాగరాజా , నందగోపాల్ పాల్గొన్నారు.










