ప్రజాశక్తి-వేటపాలెం: గ్రామీణ ప్రాంతాలలో పటిష్టమైన వైద్యం అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎంటి కృష్ణబాబు అన్నారు. శుక్రవారం వేటపాలెం మండల పరిషత్ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన బండ్ల ఆదెమ్మ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. కోటి 77 లక్షల రూపాయలతో ఈ భవనాన్ని నిర్మాణం చేపట్టినట్లు ఆయన ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతా లలో వైద్య సేవలు అందించేందుకు నాడు నేడు కింద ఫస్ట్ ఫేజ్‌లో 150 రెండో విడతలో 88 ఆరోగ్య కేంద్రాలను మంజూరు చేసినట్లు ఆయన చెప్పారు రాష్ట్రవ్యాప్తంగా 233 నూతన భవనాలకు శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. ప్రతి మండలంలో రెండు ఆరోగ్య కేంద్రాలు ఉండేటట్లు సీఎం జగన్మోహన్‌రెడ్డి చర్యలు చేపట్టారన్నారు. నిరుపేదలకు వైద్య సేవలు అందించేందుకు దోహదపడతాయన్నారు. విలేజ్ హెల్త్ క్లినిక్‌ను సచివాలయాలకు అనుసంధానం చేయనున్న ట్లు ఆయన పేర్కొన్నారు. ఆయా సచివాలయాలలో 40,000 రూపాయల వేతనంతో వైద్య సిబ్బందిని నియమించినట్లు చెప్పారు. ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు అనుసంధానంగా పనిచేసే విధంగా మెరుగైన వైద్య విధానం ప్రజలకు అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. 105 రకాల మందులు 14 రకాలకు వ్యాధి నిర్ధారణలు 67 రకాల వైద్య పరికరాలను అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాంలో వైద్యాధికారులు నెలకు రెండుసార్లు ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. బిపి, డయాబెటిస్, గర్భిణులకు ఇతర చిన్న చిన్న వ్యాధులకు అక్కడే సేవలు అందించే విధంగా చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ప్రత్యేక వైద్య సౌకర్యాలు కల్పించేం దుకు వీడియో కాలింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసినట్లు వివరించారు. విలేజ్ క్లినిక్‌లను పటిష్ట పరచుకోవడం ద్వారా 80 శాతం వ్యాధులకు అక్కడే పరిష్కారం దొరుకుతుందని చెప్పారు. వీటన్నిటిని ప్రజలు ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. వేటపాలెంలో వందేళ్ల క్రితమే ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఎనిమిది ఎకరాల స్థలాన్ని అందించడం గొప్ప విషయంగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్థల దాతలను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి, యువ నాయకుడు వెంకటేష్ బాబు, జెసి శ్యామకూరు శ్రీధర్, డిఎంఅండ్‌హెచ్‌ఓ విజయమ్మ, ఆర్డీవో సరోజిని తహశీల్దారు గరిక మహేశ్వరి పంచాయతీరాజ్ డిఎస్ శేషయ్య ఆర్‌అండ్‌బి డిఇ నరసింహులు, ఎంపీడీవో ఎంవిఎస్ శర్మ, చీరాల ఏరియా వైద్యశాల సూపరింటెం డెంట్ శేష్ కుమార్, స్థానిక పిహెచ్‌సి వైద్యులు మేడ ప్రభాకర్‌రావు, బి బాలరాజు, జిల్లా ఎన్జీవో నాయకులు చింత శేషు బాబు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఇన్‌ఛార్జి పిడి కే ఉమా, ఏపిఎం బి శ్రీనివాసరావు, ఏపీఓ వి సుధారాణి, హౌసింగ్ ఏఈ సుబ్బారావు, చీరాల డిఎల్పిఓ కె శ్రీనివాసరావు పాల్గొన్నారు.
పర్చూరు: అందరి ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంటి కృష్ణబాబు పేర్కొన్నారు. పర్చూరు మండలం కొత్తపాలెంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం ఆయన ఆకస్మికం గా తనిఖీ చేశారు. వైద్యం కోసం ఆసుపత్రికి వచ్చిన రోగులతో ఆయన స్వయంగా మాట్లాడారు. ఇంటింటికీ ఫ్యామిలీ డాక్టర్ గురించి వివరించారు. ప్రతి గ్రామంలోను నిత్యం వైద్యులు అందుబాటులో ఉంటారని తెలిపారు. ఉచితంగా అన్ని రకాల పరీక్షలు చేసి మందులు పంపిణీ చేస్తున్నారని వివరించారు. గర్భిణులను, బాలింతలను నిత్యం పరీక్ష చేసి తగిన పౌష్టికాహారం అందించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. దగ్గరలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించి చిన్నారులకు ఇస్తున్న పౌష్టికాహారం గురించి తెలుసుకున్నారు. చెరుకూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. రక్తహీనత రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి విద్యార్థులకు సూచించారు. ఈ సందర్భంగా రక్త పరీక్షలు చేయించారు. పాఠశాలలో ఇచ్చే చిక్కీలు తినాలని సూచించారు. పాఠశాల మరుగుదొడ్ల నిర్వహణపై ఆరా తీశారు. ఆయన వెంట ఆర్‌డిఓ రవీందర్, డివైఇఓ డి వెంకటేశ్వర్లు, పర్చూరు తహశీల్దారు కె నెహ్రూబాబు, మండల విద్యాశాఖాధికారి డి నాగేశ్వరరావు, వైద్యాధికారులు, ఆరోగ్య కార్యకర్తలు, సిబ్బంది పాల్గొన్నారు.










