Aug 27,2023 22:45

ప్రజాశక్తి - మార్టూరు రూరల్
గ్రామీణ ప్రాంత ప్రజలకు కార్పొరేట్ వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఉచిత వైద్య శిబిరాలే ఏర్పాటు చేస్తున్నట్లు రోటరీ అసిస్టెంట్‌ గవర్నర్‌ ఇంటూరి ఆంజనేయులు, అధ్యక్షులు తాళ్లూరి సాంబశివరావు అన్నారు. వైద్యశిభిరాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. స్థానిక ఎంఎస్ఎన్ జెడ్‌పి హై స్కూల్ ఆవరణలో గ్రానైట్ ఫ్యాక్టరీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరానికి అనూహ్య స్పందన లభించింది. చిలకలూరిపేట కొమ్మినేని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చైర్మన్, ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ కొమ్మినేని వీరశంకరరావు నేతృత్వంలో ఒంగోలు, ఉయ్యురు పట్టణాల నుండి డాక్టర్‌ మక్కెన వంశీకృష్ణ, కొమ్మినేని రేష్మ, పి నవీన్ కృష్ణ, దొంతినేని కృష్ణ చైతన్య, కోట రవి, జడా జతిన్ దేవ్, పి వెంగమాంబ, రవళి, దంత వైద్యులు పేర్ని కృష్ణ మోహన్, వైద్య సిబ్బంది సేవలు అందించారు. హాజరైన ప్రతి ఒక్కరికి ఉచితంగా పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. శిభిరానికి వచ్చిన వారికి భోజన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎఫర్ట్ చైర్మన్ జాష్టి మోహనరావు, క్యాంపు కన్వీనర్ కందిమళ్ల కోటేశ్వరరావు, గ్రానైట్ ఫ్యాక్టరీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రత్తిపాటి సురేష్, దేవినేని శ్రీనివాసరావు, కుర్రా వెంకటరామయ్య, చెరుకూరి అంజిబాబు పాల్గొన్నారు.