Aug 25,2023 22:26

ప్రజాశక్తి - కాళ్ల
           గ్రామీణ ప్రాంతాల అభివృద్దే లక్ష్యంగా పని చేస్తున్నామని ఉండి ఎంఎల్‌ఎ మంతెన రామరాజు అన్నారు. మండలంలోని ఏలూరుపాడులో రూ.20 లక్షల ఎంపీ నిధులతో నిర్మించిన డ్రెయినేజీని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు తనయకుడు భరత్‌ శుక్రవారం ప్రారంభించారు. తొలుత కాళ్లకూరు వెంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామి, అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఛైర్మన్‌ దండు వెంకట కృష్ణంరాజు, ఆలయ ఇఒ మోకా అరుణ్‌కుమార్‌ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. జువ్వలపాలెంలో గోకరాజు శివరామరాజు ఆధ్వర్యంలో పలువురు టిడిపి నాయకులు ఎంఎల్‌ఎ రామరాజు, ఎంపీ తనయుడు భరత్‌, మాజీ ఎంఎల్‌ఎ వేటుకూరి వెంకట శివరామరాజులకు మర్యాదపూర్వకంగా పుష్పగుచ్ఛం అందించారు. అనంతరం ఏలూరుపాడులో సాయిబాబా గుడి, గరువు ప్రాంతాలకు వెళ్లేందుకు రూ.ఎనిమిది లక్షలతో చేపట్టనున్న వంతెన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంఎల్‌ఎ వేటుకూరి వెంకట శివరామరాజు, గ్రామ సర్పంచి భూపతి ాజు వెంకట జగ్గరాజు, మాజీ సర్పంచులు మంతెన ఆంజనేయరాజు, అడ్డాల శివరామరాజు, టిడిపి నాయకులు వక్కపట్ల హరిబాబు, సుధాబత్తుల వంశీకృష్ణ, ఎంపిటిసి మాజీ సభ్యులు పడమట సత్యనారాయణ పాల్గొన్నారు.