Sep 04,2023 22:10

చెక్కు అందజేస్తున్న వేణుగోపాలరావు

ప్రజాశక్తి - పరిగి : ఇటీవల జరిగిన రెజ్లింగ్‌ రాష్ట్రస్థాయి పోటీలకు మండలంలోని గ్రామీణ ప్రాంతాల నుండి 8 మంది విద్యార్థులు ఎంపిక అయ్యారు. ఈ విద్యార్థులు నిరుపేద కుటుంబం నుండి వచ్చి క్రీడల్లో మంచి ప్రతిభ కనబరచడంతో వారిని ప్రోత్సహించేందుకు పరిగి వేణుగోపాలరావు ముందుకు వచ్చారు. వీరికి అవసరమైన క్రీడా సామాగ్రి, రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు వెళ్లేందుకు రవాణా ఖర్చు ఇతరత్రా ఖర్చుల నిమిత్తం ఎడ్యుకేషన్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ అందించేందుకు ముందుకు వచ్చారు ఈ మేరకు కోచ్‌ రమేష్‌ ద్వారా విద్యార్థులను కార్యాలయానికి సోమవారం పిలిపించి వారికి రూ. 12 వేల విలువైన చెక్కును అందించారు.