ప్రజాసంఘాలు, సంస్థలు ఆధ్వర్యాన ఉత్సాహంగా ఆటల పోటీలు
ప్రజాశక్తి - గణపవరం
గ్రామీణ క్రీడాకారుల అభివృద్ధి కోసం ప్రభుత్వం కేటాయించాలని కౌలురైతుల సంఘం మండల కార్యదర్శి పి.నరసింహమూర్తి అన్నారు. సంక్రాంతి సందర్భంగా ఆదివారం కేశవరంలో సంఘం ఆధ్వర్యంలో మూడు కేంద్రాల్లో యువతీ యువకులకు వాలీబాల్, కబడ్డీ, కుండ కొట్టడం, ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నరసింహమూర్తి మాట్లాడుతూ పండగ రోజుల్లో యువతీ యువకులు చెడు వ్యసనాల బారిన పడకుండా ఆటల పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో వీరవల్లి నాగేశ్వరరావు, పెచ్చెట్టి హన్సిక, పెచ్చెట్టి లక్ష్మి, వీరవల్లి గంగారత్నం, బొక్కా శ్రీను, గుబ్బల నాగలక్ష్మి పాల్గొన్నారు.
ఏలూరు: సంక్రాంతి సందర్భంగా స్థానిక పత్తేబాద బ్రహ్మం గుడి వీధి సెంటర్లో డివైఎఫ్‌ఐ, ఎపి చేతివృత్తిదారుల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ప్రతియేటా సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించినట్లు ఆయా సంఘాల నేతలు కొల్లి ఈశ్వర్, పిచ్చుక ఆదిశేషు తెలిపారు. 1988 నుండి నేటి వరకు ప్రజల సహకారంతో ఆటల పోటీలు దిగ్విజయంగా నిర్వహిస్తున్నామని ఆదిశేషు తెలిపారు వైద్య ఆరోగ్యశాఖ అధికారి బాలిన రామయ్యగౌడ్ మాట్లాడుతూ డివైఎఫ్‌ఐ ప్రజల సహకారంతో సంక్రాంతి సంబరాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం ఆటల పోటీల్లో విజేతలకు రామయ్య గౌడ్, ఆయన సతీమణి కాత్యాయని, సోషల్ వర్కర్ అల్లం సుబ్బారావు చేతుల మీదుగా బహుమతులు అందించినట్లు ఈశ్వర్, పిచ్చుక ఆదిశేషు తెలిపారు.
చింతలపూడి: పండుగల పేరుతో యువత కోడి పందేలు, పేకాట వంటి దురలవాట్లకు గురికాకుండా ఉండేందుకు ఆటల పోటీలు దోహదపడతాయని సిపిఐ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణచైతన్య అన్నారు. సంక్రాంతి సందర్భంగా ఎఐవైఎఫ్ ఆధ్వర్యంలో శని, ఆదివారాల్లో పాత చింతలపూడిలో నిర్వహించిన కబడ్డీ, ముగ్గులు, రన్నింగ్ పోటీల్లో విజేతలకు బహుమతుల ప్రదానంలో ఆయన పాల్గొన్నారు. తొర్లపాటి బాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కృష్ణ చైతన్య మాట్లాడుతూ ఆటల పోటీలతో గ్రామీణ ప్రాంత యువతలో దాగిఉన్న ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయన్నారు. కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి కంచర్ల గురవయ్య, సహాయ కార్యదర్శి పుల్లూరి సోమశేఖర్, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ ఇమ్మానియేలు, మాజీ వార్డ్ మెంబర్ కంభం సుజాత, ప్రముఖులు బోడ వజ్రం, ఎస్‌కె.జానీ, ఎస్‌కె.మస్తాన్, ముల్లగిరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
భీమడోలు: సంక్రాంతి సంబరాల్లో భాగంగా కనుమను పురస్కరించుకొని సోమవారం పొలసానిపల్లిలో ఎపి మహిళా మండలి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో లత, కె.ఇందిర, వి.లక్ష్మి, దుర్గాభవాని పాల్గొన్నారు.
కలిదిండి: మండలంలోని కోరుకొల్లు, మూలలంక, భాస్కరరావుపేట, సానా రుద్రవరం గ్రామాల్లో బాల బాలికలకు, యువతకు, మహిళలకు రన్నింగ్, మ్యూజికల్ ఛైర్స్, లెమన్ స్పూన్, వాలీబాల్, కబడ్డీ, ముగ్గుల పోటీలను ప్రజాసంఘాల ఆధ్వర్యంలో సంక్రాంతి శ్రామిక సంబరాలు నిర్వహించారు. విజేతలకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. యువత కోడిపందేలు, పేకాట వైపు మరలకుండా శ్రామిక పేటల్లో ఆటల పోటీలు నిర్వహించినట్లు వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు శేషపు మహంకాళరావు అన్నారు. ఐద్వా జిల్లా కమిటీ సభ్యులు ఎస్.మహాలక్ష్మి, కెవిపిఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు ముంగం సురేష్, డివైఎఫ్‌ఐ మండల కార్యదర్శి పంతగాని ప్రకాష్, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి జక్కుల మహేష్, వీరవల్లి భాస్కరరావు, కుడిపూడి శ్రీను, సన్నీ, వినోద్, బుస్సా రామ నాగేంద్రం, దొంగ వెంకట సత్యన్నారాయణ, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
గణపవరం: సంక్రాంతి సందర్భంగా సోమవారం జల్లికాకినాడ గ్రామంలో సిపిఎం ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పివిఆర్.సుబ్రమణ్యం అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో సిపిఎం మండల నాయకులు ఎం.పెంటారావు మాట్లాడారు. విజేతలకు గ్రామ ఉప సర్పంచి బొక్కా చినరంగారావు చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో నాయకులు పి.నరసింహమూర్తి, పి.సూర్యనారాయణ, కేతా శ్రీనివాస్, సోడదాసి సంజీవరావు, వేగేశ్న సూర్యానారాయణ పాల్గొన్నారు.










