Oct 28,2023 21:12

మొబైల్‌ స్టాల్‌ని ప్రారంభిస్తున్న చైర్‌పర్సన్‌ భావన

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : సేంద్రీయ ఉత్పత్తులను విక్రయించే గ్రామీణ కిరాణా మొబైల్‌ వాహనాన్ని డిసిఎంఎస్‌ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ అవనాపు భావన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విజయనగర ఉత్సవాలు, పైడితల్లి అమ్మవారి పండగ సందర్భంగా డిసిఎంఎస్‌ తరపున వినూత్న కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. రైతులు సేంద్రీయ పద్ధతిలో పండించిన పంటలకు మార్కెటింగ్‌ కల్పించాలన్న సదుద్దేశంతో కొర్రలు, సామలు, అరికలు, ఊదలు, రాగులు, అండుకొర్రలు, జనుగులు, పెసలు, కందులు, మినుములు, బొబ్బర్లు, సోయా, బ్లాక్‌ రైస్‌, బెల్లం, చింతపండు మార్కెటింగ్‌ చేపట్టామన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి వి.టి.రామారావు,, వైసిపి యువజన విభాగం జోనల్‌ ఇన్‌ఛార్జి అవనాపు విక్రమ్‌, డిపిఎం ఆనందరావు, డిసిఎంఎస్‌ బిజినెస్‌ మేనేజర్‌ బి.వి.ఎస్‌ సాయికుమార్‌, తదితరులు పాల్గొన్నారు.