Jan 16,2023 23:31

తీర్థంలో కొనుగోలు చేస్తున్న జనం

ప్రజాశక్తి-గొలుగొండ:మండలంలోని పాతకృష్ణదేవి పేటలో సోమవారం తీర్ధ మహోత్సవం ఘనంగా నిర్వహిచారు. ఈ కార్యక్రమానికి నాగపురం, కొంగసింగి, రత్నంపేట, ఏఎల్‌పురం గ్రామాల భజన బృందం సభ్యులు ప్రదర్శించిన చిడతలు, కోటాటం ఆకట్టుకున్నాయి.
నక్కపల్లి:మండలంలో ఉపమాక గ్రామంలో కనుమ సందర్భంగా సోమవారం తీర్థం జరిగింది. చిన్న చిన్న దుకాణాలు వెలసాయి. తీర్థంలో చిరువ్యాపారులు బొమ్మలు, ఆట వస్తువులు తదితర సామాగ్రి అమ్మకాలు చేపట్టారు. చుట్ట ప్రక్కల గ్రామాల నుంచి పెద్దలు, యువకులు, పిల్లలు అని తేడా లేకుండా జనం తరలివచ్చారు. తీర్థంలో సందడి చేసారు. పిల్లలు ఆట వస్తువులు కొనుగోలు చేసారు. యాదవులు తాడి పెద్దుల ప్రదర్శన చేసారు. తీర్ధం సందర్భంగా ఉపమాకలో జనం రద్దీ కనిపించింది.